Asianet News TeluguAsianet News Telugu

గూగుల్‌ క్రోమ్ బ్రౌజర్‌లో కొత్త ఫీచర్లు.. 10శాతం వేగంగా లోడ్‌ అవుతాయి..

గూగుల్ క్రోమ్‌లో వేగంగా లోడ్ చేసే ట్యాబ్‌ ఫీచర్లను పరిచయం చేసింది. మీరు వర్క్ ఫ్రోం హోం చేస్తున్నప్పుడు, చదువుకునేటప్పుడు క్రోమ్‌ బ్రౌజర్‌లో సులభంగా  నిర్వహించుకోవడానికి కొత్త ఫీచర్‌ యూజర్లకు ఉపయోగపడనుంది.

Google launches fast loading tabs and cool features in Chrome browser
Author
Hyderabad, First Published Aug 27, 2020, 1:07 PM IST

టెక్‌ దిగ్గజం గూగుల్‌  క్రోమ్‌ బ్రౌజర్‌ వాడే వారికోసం కొత్త ఫీచర్లను యాడ్ చేసింది. లాక్ డౌన్ వల్ల చాలా మంది ఉద్యోగులు వర్క్ ఫ్రోం హోంని, విద్యార్ధుల ఆన్ లైన్ క్లాసులను దృష్టిలో పెట్టుకొని ఈ కొత్త ఫీచర్లను తీసుకొచ్చింది.

గూగుల్ క్రోమ్‌లో వేగంగా లోడ్ చేసే ట్యాబ్‌ ఫీచర్లను పరిచయం చేసింది. మీరు వర్క్ ఫ్రోం హోం చేస్తున్నప్పుడు, చదువుకునేటప్పుడు క్రోమ్‌ బ్రౌజర్‌లో సులభంగా  నిర్వహించుకోవడానికి కొత్త ఫీచర్‌ యూజర్లకు ఉపయోగపడనుంది. గూగుల్ పనితీరును మెరుగుదల చేస్తూ ఇప్పుడు  క్రోమ్‌ ట్యాబ్‌లు 10 శాతం వేగంగా లోడ్‌ అవుతాయి. 

also read ఫ్లిప్ కెమెరాతో ఆకట్టుకుంటున్న ఆసుస్ స్మార్ట్ ఫోన్లు.. ...

"మీరు మీ ల్యాప్‌టాప్ లో క్రోమ్‌ ఉపయోగిస్తే వేగంగా ట్యాబ్‌లకు మారడం, మీరు వెతుకుతున్న పేజీని కనుగొనడం, వెబ్ బ్రౌజ్ చేయడం మీకు మరింత సులభం చేస్తుంది. లాప్ టాప్ లో మీరు క్రోమ్‌ పేజీ అడ్రస్ బార్ లో టైప్ చేస్తూనప్పుడు, మీరు అంతకుముందు ఆ పేజ్ ఓపెన్ చేసి ఉంటే ఆ పేజ్ మీకు కింద సూచిస్తుంది.

ఆండ్రయిడ్  వినియోగదారుల కోసం లింక్‌ను త్వరగా కాపీ చేయడానికి, మీరు ఇతర డివైజెస్ కి, యాప్స్ కి లింక్ పంపడానికి మీకు సహాయపడుతుంది. ఇందుకోసం మేము యూ‌ఆర్‌ఎల్ షేరింగ్ మెరుగుపర్చాము" అని గూగుల్ తెలిపింది.

స్కాన్ చేయడానికి లేదా డౌన్‌లోడ్ చేయడానికి మీరు పేజీని ప్రింట్ చేయవచ్చు లేదా క్యూఆర్ కోడ్‌ను రూపొందించవచ్చు. ఈ క్రొత్త క్యూఆర్ కోడ్ ఫీచర్ డెస్క్‌టాప్‌లోని క్రోమ్ లో అందుబాటులోకి వస్తుంది. క్రోమ్ పిడిఎఫ్ కార్యాచరణను కూడా మెరుగుపరుస్తున్నట్లు తెలిపింది. రాబోయే కొద్ది వారాల్లో వినియోగదారులు పిడిఎఫ్ ఫారమ్‌లను ఎడిట్ చేయవచ్చు, వాటిని క్రోమ్ నుండి నేరుగా ఇన్‌పుట్‌లతో సేవ్ చేసుకోవచ్చు అని గూగుల్ తెలిపింది.

Follow Us:
Download App:
  • android
  • ios