గత కొంతకాలంగా చైనా యాప్ టిక్ టాక్, అమెరికా మధ్య నిషేధ యుద్దం జరుగుతుంది. ఇప్పటికే భారత ప్రభుత్వం చైనాకు చెందిన 59 యాప్స్ ను నిషేధించిన సంగతి తెలిసిందే. తాజాగా అమెరికా కూడా ఈ జాబితాలో వచ్చి చేరింది.

చైనాకు చెందిన వీ చాట్, టిక్ టాక్ యాప్స్ ను నిషేధించనున్నట్లు అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. ఆదివారం నుంచి ఈ నిషేధం అమలులోకి రానున్నట్లు పేర్కొంది.

వీ చాట్, టిక్ టాక్ యాప్స్ గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ స్టోర్ నుంచి తొలగించాలని అభ్యర్థించింది. అయితే ఇప్పటికే ఈ యాప్స్ ను డౌన్ లౌడ్ చేసుకున్న వారు వీటిని వాడుకోవచ్చు.

అయితే అప్డేట్ వేర్షన్ లను డౌన్ లోడ్ చేసుకోలేరు. అమెరికా దేశ పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని చైనా సేకరిస్తోందని అమెరికా వాణిజ్య విభాగం కార్యదర్శి విల్ బర్ రోస్ తెలిపారు.

also read గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి పేటీఎం యాప్‌ ఔట్.. కారణం ? ...

దేశ భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. ఆదివారం నుంచి వీ చాట్ తో సంబంధమున్న ఇంటర్నెట్ ట్రాఫిక్ ను యాక్సిస్ చేయడం లేదా బదిలీ చేయడం చట్టవిరుద్ధమని ఓ ప్రకటించింది.  

ఈ నిషేధంపై టిక్ టాక్, వీ చాట్ పేరెంట్ సంస్థలు ఇంకా స్పందించలేదు. చైనాపై చర్యలు తప్పవంటూ ఇప్పటికే హెచ్చరిస్తున్న అమెరికా ఒక  ఇంటర్వ్యూలో టిక్ టాక్ ను యూఎస్ లో నిషేధించే విషయాన్ని పరిశీలిస్తోందంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు.

టిక్ టాక్, వీ చాట్ పై ఉన్న ఆంక్షలు వినియోగదారులపైన లేదా టిక్ టాక్ ఉద్యోగులపై లేవు అని పేర్కొన్నారు. ఉద్యోగులు వారి జీతాలను, బెనిఫిట్లు ఎప్పటిలాగే పొందవచ్చు. అంతేకాకుండా వీ చాట్ తో తమ కమ్యూనికేషన్ బలహీనపడవచ్చు అని ఈ నెల 15న యూఎస్ ప్రభుత్వం హెచ్చరించింది.