Asianet News TeluguAsianet News Telugu

గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి పేటీఎం యాప్‌ ఔట్.. కారణం ?

ఆన్‌లైన్ జూదం పై కంపెనీ కొత్త నిబంధనలను ఉల్లంఘించినట్లు ఆరోపణలు వచ్చినందున గూగుల్ పేటి‌ఎం యాప్ ప్లే స్టోర్ నుండి తీసివేసింది.   ఏదేమైనా పేటి‌ఎం గూగుల్ విధానాన్ని పదేపదే ఉల్లంఘించినట్లు గుర్తించింది. ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడటానికి వినియోగదారులకు పేటీఎం యాప్‌ అనుమతిస్తున్నది. ఇది స్టోర్ట్స్‌ బెట్టింగ్‌కు పాల్పడేందుకు కూడా సహకరిస్తుందని గూగుల్‌ చెబుతున్నది.   

Paytm app removed from google  Play Store because it violates Google policy  guidelines
Author
Hyderabad, First Published Sep 18, 2020, 4:03 PM IST

ఇండియన్ డిజిటల్‌ పేమెంట్ యాప్  పేటి‌ఎం గూగుల్ ప్లే స్టోర్ నుండి అదృశ్యమైంది. వన్ 97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ యాజమాన్యంలోని పేటి‌ఎం  యాప్ గూగుల్ ప్లే స్టోర్‌లో వెతికితే కనిపించట్లేదు, అయితే పేటీఎం ఫర్ బిజినెస్, పేటీఎం మనీ, పేటీఎం మాల్, కంపెనీ యాజమాన్యంలోని అన్ని ఇతర యాప్స్ మాత్రం ఇప్పటికీ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్నాయి.

అయితే ఆపిల్ యాప్ స్టోర్‌ నుండి పేటి‌ఎం యాప్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంది. ప్లే స్టోర్ నుండి పేటి‌ఎం తొలగించడం పై పేటి‌ఎం ట్విట్టర్‌ "కొత్త డౌన్‌లోడ్‌లు లేదా అప్ డేట్ కోసం గూగుల్ ప్లే స్టోర్‌లో పేటిఎం ఆండ్రాయిడ్ యాప్ తాత్కాలికంగా అందుబాటులో లేదు.

కానీ చాలా త్వరగా మళ్ళీ తిరిగి అందుబాటులోకి వస్తుంది. మీ డబ్బు అంతా పూర్తిగా సురక్షితం, మీరు మీ పేటి‌ఎం యాప్ ని ఎప్పటిలాగే ఆనందించండి. " అని ట్వీట్ చేశారు.

పేటీఎంతో పాటు పేటీఎం ఫస్ట్‌ గేమ్స్‌ను గూగుల్‌ తన ప్లే స్టోర్‌ నుంచి శుక్రవారం తొలగించింది. గ్యాంబ్లింగ్‌ గైడ్‌లైన్స్‌ ఉల్లంఘించడంతో గూగుల్‌ ఈ చర్యలు తీసుకున్నది. 

also read ఆపిల్, ఐఫోన్ యూసర్లకు గుడ్ న్యూస్.. ఇండియాలో మొదటి ఆన్‌లైన్ స్టోర్‌ ప్రారంభం.. ...

ఆన్‌లైన్ జూదం పై కంపెనీ కొత్త నిబంధనలను ఉల్లంఘించినట్లు ఆరోపణలు వచ్చినందున గూగుల్ పేటి‌ఎం యాప్ ప్లే స్టోర్ నుండి తీసివేసింది.   ఏదేమైనా పేటి‌ఎం గూగుల్ విధానాన్ని పదేపదే ఉల్లంఘించినట్లు గుర్తించింది.

ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడటానికి వినియోగదారులకు పేటీఎం యాప్‌ అనుమతిస్తున్నది. ఇది స్టోర్ట్స్‌ బెట్టింగ్‌కు పాల్పడేందుకు కూడా సహకరిస్తుందని గూగుల్‌ చెబుతున్నది.   

ప్రాడక్ట్, ఆండ్రాయిడ్ సెక్యూరిటీ అండ్ ప్రైవసీ వైస్ ప్రెసిడెంట్ అయిన గూగుల్ సుజాన్ ఫ్రే బ్లాగ్ పోస్ట్‌లోని మార్గదర్శకాలను వివరించిన కొన్ని గంటల తర్వాత గూగుల్ ప్లే స్టోర్ నుండి పేటీఎం అదృశ్యమైంది. 

పేటీఎంను వన్ 97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ అనే భారతీయ కంపెనీ యాజమాన్యంలో ఉంది, దీనిని విజయ్ శేఖర్ శర్మ స్థాపించారు, అయితే ఈ సంస్థ చైనా అలీబాబా గ్రూపుకు మిత్రదేశమైన ఫిన్‌టెక్ సంస్థ యాంట్ ఫైనాన్షియల్స్ నుండి భారీగా నిధులు పొందింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios