వన్‌ప్లస్ సంస్థ 2019 ఫోన్‌ల కోసం మొట్టమొదటి ఆక్సిజన్ ఓఎస్ 11 ఓపెన్ బీటా రూపంలో వస్తోంది. ఈ కొత్త బిల్డ్ అప్ డేట్ ను  ఇతర మొబైల్ కంపెనీలతో పోలిస్తే చాలా ఆలస్యంగా తీసుకొచ్చింది. 

చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ వన్‌ప్లస్ చివరకు ఆండ్రాయిడ్ 11 ఓ‌ఎస్ ను వన్‌ప్లస్ 7, 7 టి సిరీస్‌లకు విడుదల చేస్తోంది. వన్‌ప్లస్ సంస్థ 2019 ఫోన్‌ల కోసం మొట్టమొదటి ఆక్సిజన్ ఓఎస్ 11 ఓపెన్ బీటా రూపంలో వస్తోంది.

ఈ కొత్త బిల్డ్ అప్ డేట్ ను ఇతర మొబైల్ కంపెనీలతో పోలిస్తే చాలా ఆలస్యంగా తీసుకొచ్చింది. మిగతా వన్‌ప్లస్ వినియోగదారులకు ఈ అప్ డేట్ త్వరలోనే అందనున్నట్లు కంపెనీ ప్రకటించింది.

 ఆక్సిజన్ ఓఎస్ 11లో ఆల్వేస్ ఆన్-డిస్ ప్లే, క్రొత్త సిస్టమ్ ఫాంట్, జెన్ మోడ్‌ మెరుగుదల, సాధారణ ఆండ్రాయిడ్ 11 ఫీచర్ సెట్‌తో సహా ఉపయోగకరమైన ఫీచర్స్-ప్యాక్ చేయబడింది.

కెమెరా ఇంటర్‌ఫేస్‌కు మెరుగుదలలు, వీడియో-అఫిషియోనాడోస్ కోసం హెచ్‌ఇవిసి సపోర్ట్ ను కూడా వన్‌ప్లస్ హైలైట్ చేసింది.

also read షియోమి రిపబ్లిక్ డే సేల్‌.. ఎలక్ట్రానిక్స్ పై భారీ డిస్కౌంట్లు, ఆఫర్లు.. ...

వన్‌ప్లస్ 8, వన్‌ప్లస్ నార్డ్ ఇది వరకే ఆక్సిజన్ ఓఎస్ 11 బీటా బిల్డ్‌ను అందుకున్నాయి. దీని తర్వాత 2019 విడుదలైన వన్‌ప్లస్ 7, 7టీ మొబైల్స్ కు అప్డేట్ రావడం మొదలైంది. ఈ అప్డేట్ దశల వారీగా రానున్నట్లు ప్రకటించింది.

ఇది బీటా బిల్డ్ కాబట్టి వన్‌ప్లస్ టెస్టింగ్ కోసం సాధారణ హెచ్చరికలు వర్తిస్తాయి. ఇందులో పాల్గొనడానికి మీరు క్యారియర్ అన్‌లాక్ చేసిన మోడల్‌ను కలిగి ఉండాలి.

మీరు ఏవైనా సమస్యలను ఎదుర్కొని డౌన్ గ్రేడ్ అయితే మీరు డేటాను కోల్పోతారు. దానికి తోడు కొన్ని ఫీచర్స్ సరిగా పనిచేయకపోవచ్చు. వన్‌ప్లస్ రెండు డివైజెస్ లో ఈ క్రింద తెలిసిన సమస్యలను గమనించింది.

1.కొన్ని పరిస్థితులలో గ్యాలరీ యాప్ లోడ్ చేయడానికి ఎక్కువ టైమ్ తీసుకోవడం, కొన్ని ఫోటోలు గ్యాలరీలో చూపించకపోవడం.
2.బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసిన డివైజెస్ (ఇయర్ ఫోన్స్, స్పీకర్, మొదలైనవి) అప్పుడప్పుడు సౌండ్ ప్లే చేయలేకపోవచ్చు.
3.బ్రైట్ నెస్ ఎడ్జస్ట్మెంట్ లెవెల్ కొంత వెనుకబడి ఉండవచ్చు