చైనా ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ షియోమి ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లతో పాటు రిపబ్లిక్ డే సేల్‌ను తీసుకొచ్చింది. ఈ సేల్ ఎం‌ఐ అధికారిక వెబ్ సైట్ ద్వారా నిర్వహించనుంది.  ఈ రిపబ్లిక్ డే సేల్‌ జనవరి 20 నుండి జనవరి 24 వరకు ఉంటుంది.

 ఫ్లిప్‌కార్ట్ విఐపి, అమెజాన్ ప్రైమ్, ఎం‌ఐ విఐపి క్లబ్ సభ్యులు ఈ రోజు నుంచి సేల్ ముందస్తు అక్సెస్ పొందవచ్చు. రెడ్‌మి నోట్ 9 సిరీస్, రెడ్‌మి 9 ప్రైమ్, రెడ్‌మి 9 ఐ ధరలపై భారీ తగ్గింపుతో అందిస్తున్నారు.

రెడ్‌మి స్మార్ట్ బ్యాండ్, ఎం‌ఐ స్మార్ట్ బ్యాండ్ 4, ఎం‌ఐ వాచ్ రివాల్వ్ కూడా తగ్గింపు ధరకే కొనుగోలు చేయవచ్చు. రిపబ్లిక్ డే సేల్ లో రెడ్‌మి ఇయర్‌బడ్స్ ఎస్, ఎం‌ఐ స్మార్ట్ వాటర్ ప్యూరిఫైయర్, ఎం‌ఐ టివి స్టిక్ తో పాటు మరిన్ని ఉత్పత్తులపై ఆఫర్లు, డిస్కౌంట్‌లు కూడా  అందిస్తున్నారు.

రెడ్‌మి 9 ఐ 4 జిబి + 64 జిబి స్టోరేజ్ మోడల్ ధర రూ. 7,999, అసలు ధర  రూ. 8,299. రెడ్‌మి 9 ప్రైమ్  4 జీబీ + 64 జీబీ స్టోరేజ్ మోడల్ పై రూ. 500 డిస్కౌంట్ తో రూ. 9,499 పొందవచ్చు.

రెడ్‌మి నోట్ 9 సిరీస్‌ లోని  రెడ్‌మి నోట్ 9 6 జిబి + 128 జిబి స్టోరేజ్ మోడల్‌  రిపబ్లిక్ డే సేల్ ధర రూ. 13,999 అంటే రూ. 1,000 తగ్గింపు. రెడ్‌మి నోట్ 9 ప్రో  4 జీబీ + 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ. 13,999, అసలు ధర  రూ. 15,999 అంటే రూ. 2,000 తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు.

also read ఐటెల్‌ నుంచి మరో ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్‌.. బడ్జెట్ ధరకే అందుబాటులోకి.. ...

అదేవిధంగా రెడ్‌మి నోట్ 9 ప్రో మాక్స్ 6 జిబి + 64 జిబి స్టోరేజ్ మోడల్ ధర రూ. 17,499, అసలు ధర రూ. 18,499. అలాగే ఈ ఫోన్లపై  ఎక్స్ఛేంజి ఆఫర్ కూడా ఇస్తున్నారు.

రిపబ్లిక్ డే సేల్‌లో ఎంఐ ఎల్‌ఈడీ స్మార్ట్ టీవీలపై 1,000 రూపాయల తగ్గింపును ఆఫర్‌ చేస్తోంది. ఎంఐ స్మార్ట్ వాటర్ ప్యూరిఫైయర్ (ఆర్‌ఓ+యువి) వంటి ఇతర ఉత్పత్తులపై  రూ. 3,000 డిస్కౌంట్ లభ్యం.

వెరబుల్ ఉత్పత్తులలో  ఎం‌ఐ స్మార్ట్ బ్యాండ్ 4 అసలు ధర రూ.2,299 డిస్కౌంట్ ధర రూ. 1,899 అంటే రూ. 400 తగ్గింపు పొందవచ్చు.

ఎం‌ఐ స్మార్ట్ వాటర్ ప్యూరిఫైయర్ (ఆర్‌ఓ + యువి) వంటి ఉత్పత్తులపై  రూ. 3,000 డిస్కౌంట్ తో రూ. 9,999 కే పొందవచ్చు.

వినియోగదారులు ఎం‌ఐ  హోమ్ సెక్యూరిటీ కెమెరా 360 ° 1080p, ఎం‌ఐ   ఎల్ఇడి స్మార్ట్ కలర్ బల్బ్ (బి 22), ఎం‌ఐ  స్మార్ట్ ఎల్ఇడి బల్బ్ (వైట్), ఎం‌ఐ   మోషన్-యాక్టివేటెడ్ నైట్ లైట్ 2 అన్నీ ఒకే ప్యాకేజీలో రూ. 4,198కు పొందవచ్చు. ఈ బండిల్ ఆఫర్ ఎం‌ఐ.కం, ఎం‌ఐ హోమ్ స్టోర్లలో మాత్రమే అందుబాటులో ఉంటాయి.