ఇన్స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫాం టెలిగ్రామ్ బీటా వెర్షన్ యాప్‌లో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. టెలిగ్రామ్ యాప్ యూసర్లు ఇప్పుడు వీడియో కాల్స్ చేసుకోవచ్చు అని ఆన్‌లైన్ నివేదిక తెలిపింది.

మీరు టెలిగ్రామ్ బీటా యాప్ ఫీచర్ ఉపయోగించుకోవాలంటే  మైక్రోసాఫ్ట్ యాప్ సెంటర్ నుండి 0.7 బీటా వెర్షన్ లేదా యాప్ కొత్త యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. మీరు ఉపయోగించే టెలిగ్రామ్ యాప్ తో పాటు బీటా వెర్షన్ యాప్ ఇన్‌స్టాల్ అవుతుంది.

ఈ ఫీచర్ ప్రారంభ దశలో ఉన్నప్పటికీ, ఇది  వాట్సాప్, వైబర్‌ లాంటి యాప్స్ కి పోటీగా నిలుస్తుంది. ఒక నివేదిక ప్రకారం టెలిగ్రామ్ వాయిస్ కాల్స్‌ ఫీచర్ తీసుకొచ్చి నాలుగు సంవత్సరాలు అయ్యింది, ఇప్పుడు చివరకు వీడియో కాల్ ఫీచర్‌ను కూడా విడుదల చేసింది.

also read  సోషల్ మీడియాలో ఫెక్ న్యూస్ అరికట్టేందుకు ఫేస్‌బుక్ కొత్త ఫీచర్.. ...

ప్రస్తుతం బీటా యాప్ వెర్షన్ లో మాత్రమే వినియోగదారులకు అందుబాటులో ఉంది. టెలిగ్రామ్ బీటా వెర్షన్ యాప్ టెస్ట్ చేయాలంటే టెలిగ్రామ్ బీటా ప్రోగ్రామ్‌లో చేరాలి. టెలిగ్రామ్ బీటా వెర్షన్ యాప్ ఇంస్టాల్ చేశాక మీరు అదే 0.7 బీటా వెర్షన్ వాడే వారికి మాత్రమే వీడియో కాల్ చేయగలుగుతారు.

ఒక నివేదిక ప్రకారం టెలిగ్రామ్ వీడియో కాల్ ఇంటర్ఫేస్ ఇతర యాప్స్ ప్లాట్‌ఫారమ్‌లాగానే ఉంటుంది. వీడియో కాల్స్ సమయంలో ఫ్రంట్, బ్యాక్ కెమెరాలకు మారడానికి, వీడియో కాల్ ఆన్/ఆఫ్ చేయడానికి, కాల్ మ్యూట్ చేయడానికి ఆన్-స్క్రీన్ బటన్‌ను ఉన్నాయి.