Asianet News TeluguAsianet News Telugu

సోషల్ మీడియాలో ఫెక్ న్యూస్ అరికట్టేందుకు ఫేస్‌బుక్ కొత్త ఫీచర్..

వినియోగదారులు సోషల్ మీడియాలో  షేర్ చేసే కోవిడ్-19 సంబంధిత కంటెంట్ పై  మరింత సమాచారం ఇస్తుంది. ఏదైనా కంటెంట్ షేర్ చేసినప్పుడు అది మొదట ఎక్కడి నుండి షేర్ అయింధో నోటిఫికేషన్ ద్వారా వినియోగదారులకు తెలియజేస్తుంది.

Facebook Starts Warning Users Before Sharing COVID-19 Links
Author
Hyderabad, First Published Aug 15, 2020, 7:11 PM IST

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫేస్‌బుక్ యూసర్ల కోసం ఒక కొత్త నోటిఫికేషన్ రూపొందిస్తోంది, వినియోగదారులు సోషల్ మీడియాలో  షేర్ చేసే కోవిడ్-19 సంబంధిత కంటెంట్ పై  మరింత సమాచారం ఇస్తుంది.

ఏదైనా కంటెంట్ షేర్ చేసినప్పుడు అది మొదట ఎక్కడి నుండి షేర్ అయింధో నోటిఫికేషన్ ద్వారా వినియోగదారులకు తెలియజేస్తుంది. కరోనా వైరస్ పై తప్పుడు సమాచారాన్ని అరికట్టడానికి ఫేస్‌బుక్ చేస్తున్న పెద్ద ప్రయత్నాలలో ఇది ఒక ఒకటి.

also read బిఎస్ఎన్ఎల్ కొత్త రీఛార్జ్ ప్లాన్.. 80 రోజుల పాటు కాల్స్, డాటా ఫ్రీ ...

ఈ నోటిఫికేషన్ ప్రజలను ఫేస్‌బుక్ కోవిడ్-19 సమాచార కేంద్రానికి కూడా డైరెక్ట్ చేస్తుంది, అక్కడ వారు ప్రపంచ ఆరోగ్య అధికారుల నుండి కరోనా వైరస్ గురించి విశ్వసనీయ సమాచారాన్ని పొందవచ్చు. ఫేస్‌బుక్ ప్రకారం, నోటిఫికేషన్ వారు కంటెంట్ను షేర్ చేసే ముందు దాని రీసెన్సీ, సోర్స్ తెలుసుకోవడానికి సహాయపడుతుంది.

ఫేస్‌బుక్ గత నెలలో ఈ ఫీచర్ను ప్రకటించింది. ఇప్పుడు ఇది అందరికీ అందుబాటులో ఉంది. కోవిడ్-19 గురించి తప్పుడు సమాచారంతో పోరాడటానికి ఫేస్‌బుక్ తీసుకుంటున్న చర్యలలో ఇది  ఒక భాగం.

ఈ వారం ప్రారంభంలో విడుదల చేసిన డేటా ప్రకారం కరోనా వైరస్ గురించి తప్పుడు సమాచారం ఉన్న ఏడు మిలియన్ పోస్టులను తొలగించినట్లు ఫేస్‌బుక్ తెలిపింది. కరోనావైరస్ గురించి తప్పుడు సమాచారానికి వ్యతిరేకంగా తన నిబంధనలను ఉల్లంఘించినందుకు ఫేస్‌బుక్ మొదటిసారి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పోస్ట్ను తొలగించింది.

Follow Us:
Download App:
  • android
  • ios