ఎయిర్‌టెల్‌ తో నోకియా భారీ ఒప్పందం...

నోకియా భారతదేశపు అతిపెద్ద మొబైల్ ఆపరేటర్లలో ఒకటైన భారతి ఎయిర్‌టెల్‌ తో భారీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఒక బిలియ‌న్ డాలర్ల సుమారు రూ.7,636 కోట్ల విలువైన ఒప్పందాన్ని ఫిన్‌లాండ్‌కు చెందిన నోకియా కంపెనీ మంగళవారం ప్రకటించింది. 

telecom giant airtel big deal with nokia company

న్యూఢిల్లీ : ప్రముఖ మొబైల్ తయారీ దిగ్గజం నోకియా భారతదేశపు అతిపెద్ద మొబైల్ ఆపరేటర్లలో ఒకటైన భారతి ఎయిర్‌టెల్‌ తో భారీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఒక బిలియ‌న్ డాలర్ల సుమారు రూ.7,636 కోట్ల విలువైన ఒప్పందాన్ని ఫిన్‌లాండ్‌కు చెందిన నోకియా కంపెనీ మంగళవారం ప్రకటించింది.

ఈ ఒప్పందంలో టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్‌ కంపెనీతో కొన్ని సంవత్సరాల కాలం పాటు ఒప్పందం కుదుర్చుకున్నట్లు సంస్థ వెల్లడించింది. ఈ ఒప్పందం ద్వారా దేశంలో వినియోగదారులకు నెట్‌వర్క్ సామర్థ్యాన్ని పెంచడంతోపాటు, 5జీ సేవలను అందించాలని ఎయిర్‌టెల్‌ లక్ష్యంగా పెట్టుకుంది.

భార‌త్‌లో 2022 లోగా 3 లక్షల వ‌ర‌కు కొత్త మొబైల్ ట‌వ‌ర్ల‌ను ఏర్పాటు చేయ‌డ‌మే ల‌క్ష్యంగా నోకియా, ఎయిర్‌టెల్‌ సంస్థలు క‌లిసి ప‌నిచేయ‌నున్నామని నోకియా ఒక ప్రకటనలో తెలిపింది. 4జీ నెట్‌వర్క్‌ను బలోపేతం చేయడంతో పాటు, 5జీ సామర్థ్యాలను పెంచే ప్రయత్నంలో ఎయిర్‌టెల్ దేశంలోని తొమ్మిది సర్కిల్‌లలో ఈడీల్ చేసుకుంది.

అతిపెద్ద టెలికాం మార్కెట్లలో కనెక్టివిటీ భవిష్యత్తు కోసం ఇది చాలా ముఖ్యమైన ఒప్పందమని తెలిపింది. అలాగే భారతదేశంలో మా స్థానాన్ని ఈ ఒప్పందం మరింత పటిష్టం చేస్తుందని నోకియా సీజీవో రాజీవ్ సూరి అన్నారు.

also read రెస్టారెంట్లలో బిల్లు చెల్లించడానికి కొత్త విధానం.. క్యూఆర్ కోడ్ ద్వారా ఫుడ్ ఆర్డరింగ్..

1.3 బిలియన్ల జనాభాతో, ప్రపంచంలో రెండవ అతిపెద్ద టెలికాం మార్కెట్ భారతదేశంలో ఆన్‌లైన్ డిమాండ్ పెరిగే కొద్దీ రానున్న ఐదేళ్లలో మొబైల్ వినియగదారుల సంఖ్య 920 మిలియన్లకు పెరుగుతుందని నోకియా అంచనా వేస్తోంది.

అంతేకాదు హువావే, ఎరిక్సన్ లాంటి కంపెనీల నుండి తీవ్రమైన పోటీ నేపథ్యంలో 5జీ మొబైల్స్ మార్కెట్లోకి ప్రవేశించే ప్రయత్నాలు విఫలమై, గత అక్టోబర్‌లో 2020 ఆదాయ అంచనాను తగ్గించిన ఆరు నెలల శిక్ష విధించిన తరువాత ఈ ఒప్పందం చేసుకోవడం విశేషం. 

దీనికి ముందు ప్రకటించిన ఫలితాల్లో నోకియా 2015 తరువాత 2019 ఏడాదిలో మొదటిసారి 7 మిలియన్ యూరోల లాభంతో అంచనాలను అధిగమించి లాభాలను నమోదు చేసింది.  కాగా 25 ఏళ్ల పాటు సేవలందించిన నోకియా ప్రెసిడెంట్, భారత సంతతికి చెందిన రాజీవ్ సూరి తన సీఈవో పదవికి  రాజీనామా చేశారు.

ఈ ఏడాది ఆగస్ట్ 31వ తేదీతో ఆయన పదవీ కాలం ముగియనుంది. రాజీవ్ సూరి స్థానంలో పెక్కా లుండామర్క్ పేరును కంపెనీ ఖరారు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఫేస్ బుక్ తో రిలయన్స్ జియో భారీ ఒప్పందం చేసుకున్నా సంగతి తెలిసిందే.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios