భారత మార్కెట్ లోకి టెక్నో కామోన్ 64 మెగాపిక్సెల్ కెమెరా స్మార్ట్ ఫోన్...
కొత్త ఫోన్ 64 మెగాపిక్సెల్ క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. టెక్నో కామోన్ 16 స్మార్ట్ ఫోన్ ని మొదటిసారి ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేస్తుంది. టెక్నో కామోన్ 16 స్మార్ట్ ఫోన్ కి ఫింగర్ ప్రింట్ సెన్సార్, 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, హోల్-పంచ్ డిస్ ప్లే ప్రధాన ఫీచర్లు.
సరికొత్త స్మార్ట్‌ఫోన్ టెక్నో కామోన్ 16 భారతదేశంలో విడుదలైంది. కొత్త ఫోన్ 64 మెగాపిక్సెల్ క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. టెక్నో కామోన్ 16 స్మార్ట్ ఫోన్ ని మొదటిసారి ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేస్తుంది. టెక్నో కామోన్ 16 స్మార్ట్ ఫోన్ కి ఫింగర్ ప్రింట్ సెన్సార్, 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, హోల్-పంచ్ డిస్ ప్లే ప్రధాన ఫీచర్లు.
భారతదేశంలో టెక్నో కామోన్ 16 ధర, సేల్
టెక్నో కామోన్ 16 ధర భారతదేశంలో రూ. 10,999. 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లో వస్తుంది. అక్టోబర్ 16 నుండి ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సందర్భంగా టెక్నో కామోన్ 16 అందుబాటులో ఉంటుంది. క్లౌడ్ వైట్, ప్యూరిస్ట్ బ్లూ రెండు కలర్ వేరియంట్‌లలో లభిస్తుంది.
also read ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సెల్.. అతి తక్కువ ధరకే ఆండ్రాయిడ్ టీవీలు.. ...
టెక్నో కామోన్ 16 ఫీచర్స్
స్పెసిఫికేషన్లకు అనుగుణంగా టెక్నో కామోన్ 16 ఆండ్రాయిడ్ 10 ఆధారిత హియోస్ 7.0 ఆపరేటింగ్ సిస్టమ్, 6.8-అంగుళాల హెచ్‌డి + హోల్-పంచ్ డిస్ ప్లే 89.1 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియో, మీడియాటెక్ హెలియో జి79 SoCతో వస్తుంది.
64 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డీప్ ఫీల్డ్ సెన్సార్ కెమెరా, 2-మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ కెమెరా, ఆటోమాటిక్ ఇంటెల్లిజెన్స్ లెన్స్‌తో కూడిన క్వాడ్ కెమెరా సెటప్ ఇందులో ఉంది.
ఆటో ఐ ఫోకస్, వీడియో బోకె, 2కె క్యూహెచ్‌డి వీడియో సపోర్ట్, నైట్ పోర్ట్రెయిట్, సూపర్ నైట్ షాట్, మాక్రో, బాడీ షేపింగ్, 10 ఎక్స్ జూమ్, స్లో మోషన్ వంటి ప్రో ఫోటోగ్రఫీ మోడ్ ముఖ్యమైన ఫీచర్స్ ఉన్నాయి. ఫోన్ ముందు 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది.
18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీని అందిస్తున్నారు. 29 రోజుల స్టాండ్ బై, 34 గంటల కాలింగ్ సమయం, 16 గంటల వెబ్ బ్రౌజింగ్, 22 గంటల వీడియో ప్లేబ్యాక్, 15 గంటల గేమ్ ప్లే, 180 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్ స్టాండ్ బై సమయాన్ని అందిస్తుంది. సుమారు రెండు గంటల్లో ఫోన్ పూర్తిగా ఛార్జ్ అవుతుందని టెక్నో కంపెనీ పేర్కొంది.