ఫ్లిప్‌కార్ట్‌ బిగ్ బిలియన్ డేస్ సెల్.. అతి తక్కువ ధరకే ఆండ్రాయిడ్ టీవీలు..

అక్టోబర్ 16 నుండి 21 వరకు ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ బిలియన్ డేస్ సెల్ లో భాగంగా 'బిగ్ సేవ్ ఆన్ బిగ్గర్ టివి ఆఫర్'ను తీసుకువచ్చింది. థామ్సన్ ఫ్లిప్‌కార్ట్‌లోని అన్ని ఎస్‌బిఐ కార్డ్ హోల్డర్లకు 10 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ ఆఫర్‌ను అందిస్తున్నారు. 

Thomson announces TV deals, price to start from Rs 5,999 on Flipkart big billion days sale-sak

 యూరప్‌లోని ప్రముఖ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ బ్రాండ్ థామ్సన్ అక్టోబర్ 16 నుండి 21 వరకు ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ బిలియన్ డేస్ సెల్ లో భాగంగా 'బిగ్ సేవ్ ఆన్ బిగ్గర్ టివి ఆఫర్'ను తీసుకువచ్చింది. థామ్సన్ ఫ్లిప్‌కార్ట్‌లోని అన్ని ఎస్‌బిఐ కార్డ్ హోల్డర్లకు 10 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ ఆఫర్‌ను అందిస్తున్నారు.

గత 3 సంవత్సరాలుగా భారత మార్కెట్లో కార్యకలాపాలను నిర్వహిస్తున్న థామ్సన్ ప్రస్తుతం 'హర్ బాత్ బడి' మార్కెటింగ్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు.

ఈ సంవత్సరం ప్రారంభంలో థామ్సన్ టివి గూగుల్ భాగస్వామ్యంతో భారతదేశంలో పూర్తిగా పరీక్షించి, అభివృద్ధి చేసిన సర్టిఫైడ్ ఆండ్రాయిడ్ టివిలను విడుదల చేసింది. అలాగే  ప్రీమియం బడ్జెట్ ధరకే సెమీ ఆటోమేటిక్, ఫుల్ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్లను కూడా ప్రవేశపెట్టింది.

థామ్సన్ టీవీ డీల్స్ లో ఆర్9 సిరీస్ కింద రూ.5999 ప్రారంభ ధరకే టి‌విలను అందిస్తుంది. థామ్సన్ ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ  టీవీ ధరలు రూ.10, 999 నుండి ప్రారంభమవుతాయి. 

ఆర్9 సిరీస్ కింద రెండు టీవీలు 24 అంగుళాల  హెచ్‌డి బేసిక్ టి‌వి ధర రూ.5,999, 32 అంగుళాల  హెచ్‌డి బేసిక్ టి‌వి ధర రూ.8,499 లభిస్తుంది.

also read ఆపిల్ కళ్ళు చెదిరే దీపావళి ఆఫర్: ఐఫోన్ 11 కొంటె ఎయిర్ పాడ్స్ ఫ్రీ.. ...

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్‌లో ఈ క్రింది ధరలకు థామ్సన్ టి‌వి మోడళ్లు లభిస్తాయి:

పాథ్ సిరీస్ థామ్సన్ మోడళ్లు 
32 పాథ్ 0011  ధర - 10,999 రూపాయలు
32 పాథ్ 0011బీఎల్ ధర -11,499 రూపాయలు
40 పాథ్ 7777 ధర - 15,999 రూపాయలు
43 పాథ్ 0009ధర - 18,999 రూపాయలు
43 పాథ్ 4545 ధర -22,499 రూపాయలు
50 పాథ్1010 ధర -24,499 రూపాయలు
55 పాథ్ 5050 ధర - 28,999  రూపాయలు

ఆథ్రో సిరీస్  థామ్సన్ టీవీ మోడల్స్  
43 ఆథ్రో 2000 - 22,499 రూపాయలు
50 ఆథ్రో 1212 - 27,499 రూపాయలు
55 ఆథ్రో  0101 - 30,999 రూపాయలు
65 ఆథ్రో  2020 - 45,999 రూపాయలు
75ఆథ్రో  2121 - 94,499 రూపాయలు 

సూపర్ ప్లాస్ట్రోనిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎస్పిపిఎల్) సిఇఒ అవనీత్ సింగ్ మార్వా ఒక ప్రకటనలో, "గత 3 నుండి 4 నెలల్లో 20కి పైగా ఆన్‌లైన్ స్టోర్స్ చేర్చబడ్డారు (ఇటీవల ప్రచురించిన బిసిజి సర్వే ప్రకారం).

ఆన్‌లైన్ ఆర్డర్లు కోవిడ్-19 పూర్వ స్థాయికి కోలుకోవడమే కాక, వేగవంతమైన వృద్ధిని కూడా నమోదు చేసింది. థామ్సన్ అందించే టెక్నాలజి ఉత్పత్తులలు ఎంతో ఉత్తమమైనవి. ఈ పండుగ సీజన్లో మేము 200,000 యూనిట్ల అమ్మకాలని అంచనా వేస్తున్నాము. " అని అన్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios