Asianet News TeluguAsianet News Telugu

ఉద్యోగాల కోతపై క్లారీటి: కొత్తగా 40 వేల జాబ్స్... కానీ ?

కరోనా మహమ్మారి దెబ్బకు సాఫ్ట్​వేర్​ ఉద్యోగాలన్నీ కూలిపోతున్నాయి. ఇక ఉద్యోగుల భవితవ్యం గాల్లో దీపమే' అంటూ చక్కర్లు కొట్టిన వదంతులకు ప్రముఖ సాఫ్ట్ వేర్ దిగ్గజం టీసీఎస్ గట్టిగా సమాధానమిచ్చింది​. ఒక్క ఉద్యోగిని కూడా తొలగించబోమని స్పష్టం చేసింది. అంతే కాక త్వరలోనే మరో 40 వేల మంది ఫ్రెషర్లనూ నియమించుకుంటామని తేల్చిచెప్పింది.
 

TCS says will honour all new job offers, including to 40,000 new graduates
Author
Hyderabad, First Published Apr 18, 2020, 12:21 PM IST

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ప్రభావంతో వివిధ రంగాల ఉద్యోగాలు కొడిగట్టిన దీపంగా మారిపోతున్నాయి. ఐటీ రంగానిదీ ఇదే దారి. కానీ ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాది తమ ఉద్యోగుల్లో ఏ ఒక్కరినీ తొలగించబోమని పేర్కొంది.

అయితే ఉద్యోగులకు మాత్రం ఈ ఏడాది ఎలాంటి వేతనాల పెంపు ఉండబోదని టీసీఎస్ స్పష్టం చేసింది. అంతేకాకుండా 40 వేల ఉద్యోగాల్లో కేవలం ఫ్రెషర్లను నియమించుకోనున్నట్లు తెలిపింది. ప్రస్తుతం కరోనా మహమ్మారి వల్ల దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ అనంతరం.. పెద్ద ఎత్తున ఉద్యోగాల్లో కోత ఉండబోతోందన్న వార్తలను టీసీఎస్ ఖండించింది.‌

మార్చితో ముగిసిన త్రైమాసికంలో సంస్థ లాభాలు నమోదు చేసిందని టీసీఎస్ తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి రెండు త్రైమాసికాల్లో మాత్రం పరిస్థితులు అంత అనుకూలంగా ఉండబోవని కంపెనీ పేర్కొంది. 

ప్రస్తుతం అన్ని విభాగాల్లో కలిపి దాదాపు 4.5 లక్షల మంది పనిచేస్తున్నారని, ఏ ఒక్కరినీ తొలగించబోమని టీసీఎస్‌ ఎండీ, సీఈవో రాజేశ్‌ గోపీనాథ్‌ స్పష్టం చేశారు. జూన్‌తో విద్యా సంవత్సరం ముగుస్తుందని.. ఇప్పటికే ఎంపికైన ఫెషర్లు ఆ తర్వాత విధుల్లోకి చేరతారని సంస్థ తెలిపింది. 

also read  అద్భుతమైన డిస్​ప్లేతో నోకియా ప్యూర్ వ్యూ స్మార్ట్​ఫోన్...

కరోనా పరిస్థితుల వల్ల ఈ ఏడాది ఉద్యోగులెవరికీ వేతనాల పెంపు ఉండబోదని టీసీఎస్ స్పష్టం చేసింది. గురువారం జనవరి-మార్చి 2019-20 త్రైమాసికం ఫలితాలను ప్రకటించింది. మనదేశంలో అతి పెద్ద ఐటీ కంపెనీ టీసీఎస్‌ మార్చితో ముగిసిన త్రైమాసికంలో అద్భుత పనితీరు కనబర్చింది. ఈ మూడు నెలల్లో కంపెనీ రెండంకెల వృద్ధిరేటు సాధించింది. 

కానీ నికర లాభాల్లో కాస్త క్షీణతను నమోదైనట్లు టీసీఎస్ వెల్లడించింది. గతేడాది ఇదే సమయంలో రూ.8,126 కోట్ల ఏకీకృత నికర లాభం సాధించగా.. ఈ సారి అది రూ.8049 కోట్లకు పరిమితమైంది.

మార్కెట్‌ వర్గాల అంచనాలకు మించి ఫలితాలను టీసీఎస్  కంపెనీ నమోదు చేసింది. వరసగా అయిదో త్రైమాసికంలో కంపెనీ రెండంకెల వృద్ధిరేటు సాధించింది. గడచిన 15 త్రైమాసికాల్లోకెల్లా ఈ త్రైమాసిక పనితీరు అత్యంత గొప్పదని కంపెనీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ రాజేష్‌ గోపినాథన్‌ అన్నారు.

ఈసారి కంపెనీ ఆదాయంలో బ్రిటన్‌ నుంచి ఆదాయం 21.3 శాతం, యూరప్‌ నుంచి 17.5 శాతం పెరగ్గా అమెరికా ఆదాయం 9.9 శాతం పెరిగినట్లు కంపెనీ తెలిపింది. కంపెనీ పనితీరుపై మార్కెట్‌లో అనుమానాలతో షేర్‌ 0.26 శాతం తగ్గి రూ. 2013 వద్ద ముగిసింది.

Follow Us:
Download App:
  • android
  • ios