న్యూఢిల్లీఫ ఫిన్​లాండ్​ స్మార్ట్​ ఫోన్​ దిగ్గజం నోకియా.. గతంలో కెమెరాకు ప్రాధాన్యమిస్తూ 'నోకియా 9 ప్యూర్​వ్యూ' స్మార్ట్​ఫోన్​ను విడుదల చేసింది. ఇప్పుడు 'నోకియా 9.3 ప్యూర్​వ్యూ' మోడల్​ మొబైల్​ను మార్కెట్లోకి తీసుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది నోకియా మాతృ సంస్థ హెచ్​ఎండీ గ్లోబల్. 

ఈ ఫోన్​లో​ 120 హెచ్​​జెడ్​ డిస్​ప్లే, 108 ఎంపీ సామర్థ్యం ఉన్న రేర్ కెమెరా అందించనుంది. ప్రస్తుతం కరోనా మహమ్మారి కారణంగా ఈ మొబైల్​ విడుదల ఎప్పుడు అనేదానిపై స్పష్టత లేదు. అయితే ఈ ఏడాది ద్వితియార్ధంలో విపణిలోకి తెచ్చేందుకు సంస్థ ప్రణాళికలు రచిస్తోంది.

also read వన్‌ప్లస్ నుండి కొత్త 5జి స్మార్ట్ ఫోన్స్ లాంచ్...

నోకియా 9.3కి 108 ఎంపీ మెయిన్ స్నాపర్​ కాకుండా 24 ఎంపీ, 20 ఎంపీ, 48 ఎంపీ సెన్సార్లను కూడా పరీక్షిస్తున్నట్లు తెలిపింది జీఎస్​ఎం​ఏ. డిస్​ప్లే కోసం ఓఎల్​ఈడీ ప్యానెల్​, ఎల్​సీడీ ప్యానెల్​లను పరిశీలిస్తోంది. అయితే ఓఎల్​ఈడీ ప్యానెల్​నే ఉపయోగించే అవకాశం ఎక్కువ ఉందని తెలుస్తోంది.

ఈ మొబైల్​లో 9-లెన్స్​కు బదులుగా ట్రెడిషనల్ కెమెరా సెటప్​ను ఉపయోగించారు. శ్నాప్​ డ్రాగన్​ 865 ప్రాసెసర్​తోపాటు క్యూహెచ్​డీ + అమోలెడ్​ డిస్​ప్లే, అండర్​ సెల్ఫీ లేదా పాప్​ అప్​ సెల్ఫీ కెమెరా ఇందులో ఉంటాయని భావిస్తున్నారు.