ముంబై: భారతదేశ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగంలో ‘స్టెమ్’ టెక్నాలజీ గల వారికి ఉద్యోగావకాశాలు పుష్కలంగా ఉన్నాయి. సైన్స్‌, టెక్నాలజీ, ఇంజినీరింగ్‌, మ్యాథమేటిక్స్‌ (స్టెమ్‌) విభాగంలో ఉద్యోగాలు మూడేళ్ల (2016 నవంబర్ నుంచి 2019 నవంబర్) మధ్య కాలంలో 44శాతం పెరిగాయని ఇండీడ్‌ వెబ్‌సైట్‌ పేర్కొంది. 

also read బెంగళూరును బీట్ చేసిన హైదరాబాద్... ఐటీ ఉద్యోగాలకు మనమే బెస్ట్...

ఆ మూడేళ్లలో తమ వెబ్‌సైట్‌లో జరిగిన పోస్టింగ్స్‌, సెర్చింగ్స్‌ ఆధారంగా నివేదికను తయారుచేసినట్లు తెలిపింది. 2018 నవంబర్- 2019 నవంబర్ మధ్య ఐదు శాతం ఉద్యోగాలు పెరిగాయని పేర్కొన్నది.

రోబోటిక్స్‌, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐఓటీ) వంటి పలు టెక్నాలజీల్లో వస్తున్న పురోగతి వల్ల ఉద్యోగార్థులకు స్టెమ్‌ కొలువులు అత్యంత నమ్మకమైనవిగా మారాయని వివరించింది. మొత్తం స్టెమ్‌ ఉద్యోగాల్లో ఢిల్లీ 31 శాతం కొలువులను కల్పించి అగ్రస్థానంలో నిలిచిందని ఇండీడ్ ఇండియా అండ్ వెబ్ సైట్ డైరెక్టర్ వెంకట మాచవరపు తెలిపారు. 

also read గీత దాటారో తస్మాత్ జాగ్రత్త: ఈ-కామర్స్ సంస్థలకు సీసీఐ వార్నింగ్ 

గత మూడేళ్లలో దేశీయంగా నిరంతరం స్థిరంగా స్టెమ్ విభాగాల్లో నియామకాలు పెరుగుతున్నాయని ఇండీడ్ ఇండియా అండ్ వెబ్ సైట్ డైరెక్టర్ వెంకట మాచవరపు పేర్కొన్నారు. కానీ తూర్పు రాష్ట్రాల్లో మాత్రం స్టెమ్ విభాగాల్లో ఉద్యోగ నియామకాలు కేవలం నాలుగు శాతం మాత్రమేనని తెలిపారు.

తర్వాత స్థానాల్లో ముంబై (21శాతం), బెంగళూరు (14శాతం), పుణె (12శాతం), హైదరాబాద్‌ (12శాతం), చెన్నై (10శాతం) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ప్రాంతాల వారీగా పశ్చిమ భారత రాష్ట్రాలు అత్యధికంగా 34 శాతం ఉద్యోగాలను కల్పించగా.. ఉత్తర, దక్షిణాది రాష్ట్రాలు చెరో 31 శాతంతో తర్వాతీ స్థానాల్లో నిలిచాయి.