Asianet News TeluguAsianet News Telugu

ట్విట్టర్ సంచలనం.. లక్షకు పైగా ట్విట్టర్ అకౌంట్లు డిలీట్‌...

వైరల్ చేస్తున్న పోస్టులు హాంగ్ కాంగ్ నిరసనలు, కరోనా వైరస్ సంక్షోభాలకు సంబంధించినవి, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనాకు అనుకూలంగా ఉన్నాయి అని ఒక నివేదిక ప్రకారం సోషల్ మీడియా సంస్థతో కలిసి పనిచేస్తున్న నిపుణుల తెలిపారు.

socilal media twitter shuts down 1.7 crore  accounts for spreading chinese government narratives
Author
Hyderabad, First Published Jun 13, 2020, 4:06 PM IST

మైక్రో బ్లాగింగ్ సైట్ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్‌ ఒక కొత్త నిర్ణయం తిసుకుంమరో. అందుకోసం ట్విట్టర్ 1.7 లక్షల ఖాతాలను డిలీట్ చేస్తున్నట్టు తెలిపింది. చైనా ప్రభుత్వానికి అనుకూలంగా ఫెక్ న్యూస్ వైరల్ చేస్తు పోస్టులు చేస్తున్నారని అవి ట్విట్టర్ నిబంధనలకు విరుద్దంగా ఉన్నాయని గురువారం ట్విట్టర్ ప్రకటించింది.  

వైరల్ చేస్తున్న పోస్టులు హాంగ్ కాంగ్ నిరసనలు, కరోనా వైరస్ సంక్షోభాలకు సంబంధించినవి, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనాకు అనుకూలంగా ఉన్నాయి అని ఒక నివేదిక ప్రకారం సోషల్ మీడియా సంస్థతో కలిసి పనిచేస్తున్న నిపుణుల తెలిపారు.

ఈ ఖాతాలు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనాకు అనుకూలమైన రాజకీయ సమాచారాన్ని వైరల్ చేస్తున్నాయని" ట్విట్టర్ పేర్కొంది. వారు చేసేది ట్విట్టర్ నిబంధనలకు విరుద్ధం ఇంకా ట్విట్టర్ నిబంధనలు ఉల్లంఘించినట్లు అని తెలిపారు.

also read రిలయన్స్ ఏజియో.కం బిగ్ బోల్డ్ సేల్‌ ఆఫర్..బిగ్ బ్రాండ్స్, బోల్డ్ డిస్కౌంట్స్..

సస్పెండ్ చేసిన ఖాతాలు అన్నీ ప్రధానంగా చైనా భాషల్లో ట్వీట్ చేసినట్లు ట్విట్టర్ తెలిపింది. అయితే చైనాలో  అంతకుముందే ట్విట్టర్ యాప్ ని అధికారికంగా బ్లాక్ చేసింది. ప్రజలు సోషల్ మీడియా సైట్‌తో  వి‌పి‌ఎన్ కనెక్షన్ ద్వారా యాక్సెస్ చేస్తున్నట్లు గుర్తించింది.


ఆస్ట్రేలియన్ స్ట్రాటజిక్ పాలసీ ఇన్స్టిట్యూట్ ప్రకారం, ఈ వైరల్ పోస్టులు ముఖ్య లక్ష్యం ఏంటంటే విదేశాలలో నివసిస్తున్న చైనా జాతీయులతో అమెరికన్ పార్టీ పై రాష్ట్ర ప్రజల ప్రభావాన్ని విస్తరించెందుకు చేస్తున్న ప్రయత్న ఇది. కరోనా వైరస్ చుట్టూ ఉన్న కథనాలు వైరస్ పట్ల చైనా ప్రతిస్పందనను ప్రశంసించాయి. రష్యా, టర్కీతో ముడిపడి ఉన్న ఖాతాలను మూసివేసినట్లు కంపెనీ ప్రకటించింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios