రిలయన్స్ యజమాన్యంలోని ఏజియో.కం ఆన్ లైన్ స్టోర్ ఇప్పుడు కస్టమర్ల కోసం సరికొత్త అద్భుతమైన ఆఫర్లను తీసుకొచ్చింది. కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా ఈ-కామర్స్ పై ఆంక్షలు విధించారు.

దీంతో ఈ-కామర్స్ సేల్స్ పై కాస్త ప్రభావం కనిపించిన తాజాగా లాక్ డౌన్ ఆంక్షల సడలింపుతో సేల్స్ పై ఏజియో.కం  దృష్టి పెట్టింది. ఆన్-ట్రెండ్, ఫ్రెషెస్ట్ స్టైల్స్, హై-ఆన్ ఫ్యాషన్ కి ప్రసిద్ది చెందిన భారతదేశపు ప్రముఖ ఆన్‌లైన్ ఫ్యాషన్ ఇ-రిటైలర్ ఏజియో.కం జూన్ 11 నుండి 15 వరకు బిగ్ బోల్డ్ సేల్‌ ప్రకటించింది.

ఏజియో.కం బిగ్ బోల్డ్ సేల్ ద్వారా వినియోగదారులందరికీ అన్నీ స్టైలిష్ బట్టలు, షూస్, టాప్ బ్రాండ్ లపై బొల్డ్ డిస్కౌంట్లను అందిస్తుంది. 2వేలకు పైగా బ్రాండ్ల నుండి 2 లక్షల స్టైల్స్, ఫ్యాషన్ దుస్తులు, ఆకర్షణీయమైన షూస్, చెప్పులు ఇంకా ఎన్నో  బిగ్ బోల్డ్ సేల్‌ లో భాగంగా ఉన్నాయి.

also read రెస్టారెంట్లు, హోటల్స్‌, కస్టమర్లకు పేటీఎం‌ గుడ్‌న్యూస్‌..

బిగ్ బోల్డ్ సేల్‌ ఇంతకు ముందు ఎన్నడూ లేని ఆఫర్‌లతో ఇప్పుడు మెగా ఫ్యాషన్ ఈవెంట్ కానున్నది. ఏజియో.కం బిగ్ బోల్డ్ సేల్‌లో నైక్, ప్యూమా, అడిడాస్, లెవిస్, యునైటెడ్ కలర్స్ ఆఫ్ బెనెటన్ వంటి నచ్చిన బ్రాండ్ల నుండి స్టైలిష్, మోడ్రన్  అపరల్స్ ఉన్నాయి.

ఇలాంటి బ్రాండ్లపై ఆఫర్లను మిస్ చేస్కోవడం షాపింగ్ ప్రియులకు కష్టమే మరి. ఈ సెల్ లో ప్రతిఒక్కరికీ ఏదో ఒక ఆఫర్ తప్పకుండ నచ్చుతుంది. ఇంకా మీరు 50 నుండి 90% వరకు డిస్కౌంట్‌పై కూడా స్టైలిష్, టీ-షర్టులు, జీన్స్, కుర్తాస్, స్నీకర్స్ వంటి ఇంకా ప్రముఖమైన వాటిపై ఫ్లాష్ డీల్స్ కూడా ఉన్నాయి.

 డిస్కౌంట్లతో పాటు, ఈ సెల్ సమయంలో ఇతర అంతర్జాతీయ బ్రాండ్లను కూడా ఏజియో.కం ప్రవేశపెడుతుంది.