వాట్సాప్ కొత్త ఫీచర్...చాట్ బ్యాక్ అప్ ఇక సేఫ్..
ఫేస్‌బుక్ యాజమాన్యంలోని మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ అయిన వాట్సాప్ ఇప్పుడు ఈ కొత్త ఫీచర్ ని బీటా వర్షన్ లో పరీక్షిస్తుంది.
న్యూ ఢిల్లీ : సోషల్ మీడియా మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ అయిన వాట్సాప్ ఒక కొత్త ఫీచర్ ని ప్రవేశపెట్టబోతుంది. అదేంటంటే ఇకపై గూగుల్ డ్రైవ్‌లో వినియోగదారులు తమ చాట్ మెసేజులను, చాట్ మీడియాని బ్యాకప్ చేసుకున్నపుడు వాటికి మరింతగా భద్రత కోసం పాస్‌వర్డ్ ఫీచర్ జోడించనుంది.
ఫేస్‌బుక్ యాజమాన్యంలోని మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ అయిన వాట్సాప్ ఇప్పుడు ఈ కొత్త ఫీచర్ ని బీటా వర్షన్ లో పరీక్షిస్తుంది.యాప్ సెట్టింగ్‌లలోని ‘చాట్ బ్యాకప్’ విభాగంలో ‘పాస్‌వర్డ్ ప్రొటెక్ట్ బ్యాకప్’ సెలెక్ట్ చేసుకోవడం ద్వారా యూజర్లు ఈ కొత్త ఫీచర్‌ను యాక్సెస్ చేయవచ్చు.
also read ఒప్పో నుంచి కొత్త యాప్...10 లక్షల వరకు పర్సనల్ లోన్ పొందవచ్చు...
ఈ ఆప్షన్ ప్రస్తుతం బీటా వర్షన్ అప్ డేట్ చేసుకున్నా వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. ఈ ఫీచర్ బీటా వర్షన్ లో పరీక్షించిన తరువాత, వారు ఓటిఏ అప్ డేట్ ద్వారా కొన్ని వారాలు లేదా నెలల తరువాత అందరికీ అందుబాటులోకి వస్తుంది.
గూగుల్ డ్రైవ్ లేదా ఐక్లౌడ్‌లో బ్యాకప్ చేయబడిన చాట్ భద్రపరచడానికి తగినంతగా సెక్యూరిటి లేదని ప్రత్యర్థి మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు పాల్ దురోవ్ వాట్సాప్‌ను విమర్శిస్తున్నా సంగతి మీకు తెలిసిందే.
ఇకపై వాట్సాప్ యూజర్లు పాస్‌వర్డ్‌ను ఉపయోగించడం ద్వారా తమ చాట్ బ్యాక్ అప్ ను కాపాడుకునే వెసులుబాటు అందుబాటులోకి రానుంది. పాస్‌వర్డ్ ప్రొటెక్ట్ బ్యాక్ అప్స్ అనే ఫీచర్ పేరుతో న్యూ అప్‌డేట్ ఉంటుందని డబ్ల్యూఏబీటాఇన్ఫో వెల్లడించింది.
also read వోడాఫోన్ ఐడియా డబుల్ డేటా ఆఫర్...మూడు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు...
ప్రస్తుతం ఒక ఫోన్ నుంచి మరో ఫోన్‌కు మారిన క్రమంలో వాట్సాప్ చాట్స్‌ను కలిగి ఉండటంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
ఇక ఎన్నాళ్లుగానో వేచిచూస్తున్న డార్క్ మోడ్ ఫీచర్‌ను యూజర్లందరికీ వాట్సాప్ మంగళవారం అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇక యూజర్లు ఇప్పుడు తమ ఆండ్రాయిడ్ 10, ఐఓఎస్ 13 ఫోన్లలో డార్క్ మోడ్ ఆప్షన్‌కు మళ‍్లగానే ఆటోమేటిక్‌గా డార్క్ మోడ్ థీమ్ ఆన్ అవుతుంది.
గత కొంతకాలంగా వాట్సాప్ పరీక్షిస్తున్న ఈ ఫీచర్ తాజాగా యూజర్లందరికీ అందుబాటులోకి వచ్చింది. ఫిబ్రవరి 12న ఫేస్‌బుక్ వాట్సాప్ వినియోగదారుల సంఖ్య 2018 లో 1.5 బిలియన్ల నుండి 2 బిలియన్లకు పెరిగిందని ప్రకటించింది.