పబ్-జికి పోటీగా ఫేస్‌బుక్ నుంచి సరికొత్త ఫ్రీ గేమింగ్ యాప్...!
ప్రస్తుతం ఫేస్‌బుక్ సంస్థ ఈ యాప్‌ను ఆండ్రాయిడ్ ఫోన్లలోకి అందుబాటులోకి తీసుకొచ్చింది .తరువాత యాపిల్ సంస్థ నుంచి ఆమోదం లభిస్తే త్వరలో ఐఓఎస్ స్మార్ట్ ఫోన్లకు కూడా అందుబాటులోకి సుకువస్తుంది.
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ ఓ గేమింగ్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొస్తోంది. దీనిని వినియోగదారులకు ఈ యాప్‌ను ఉచితంగా అందించనుంది. ప్రస్తుతం ఫేస్‌బుక్ సంస్థ ఈ యాప్‌ను ఆండ్రాయిడ్ ఫోన్లలోకి అందుబాటులోకి తీసుకొచ్చింది .
తరువాత యాపిల్ సంస్థ నుంచి ఆమోదం లభిస్తే త్వరలో ఐఓఎస్ స్మార్ట్ ఫోన్లకు కూడా అందుబాటులోకి సుకువస్తుంది. భారత దేశంతో పాటు కరోనా వైరస్‌ను అడ్డుకునేందుకు ప్రపంచ దేశాలు లాక్‌డౌన్ అమలు చేస్తున్నాయి. దీని వల్ల ప్రజలు బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది.
దీంతో దాదాపు అందరుకు ఇళ్లకే పరిమితమయ్యారు. స్మార్ట్ ఫోన్ ఉన్నవారు ఎక్కువ సమయం సోషల్ మీడియాలోనే గడుపుతున్నారు. యూట్యూబు, మూవీ యాప్స్, వీడియో గేమ్‌లు ఆడుతూ సమయాన్ని గడుపుతున్నారు. అయితే ఎలాంటి సమయంలో ఫేస్‌బుక్ ఓ గేమింగ్ యాప్‌ను అందుబాటులోకి తీసుకురానుంది.
వినియోగదారులకు ఉచితంగా ఈ యాప్‌ను అందించనుంది. ప్రస్తుతం ఫేస్‌బుక్ సంస్థ ఈ యాప్‌ను ఆండ్రాయిడ్ ఫోన్లలోకి అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇక యాపిల్ సంస్థ నుంచి ఆమోదం లభిస్తే త్వరలో ఐఓఎస్ వెర్షన్‌లోనూ ఈ గేమింగ్ యాప్‌ను విడుదల చేయలని చూస్తుంది.
also read వాట్సాప్‌లో లేటెస్ట్ ఫీచర్... ఫోన్ స్విచ్ ఆఫ్ అయిన కూడా...
అలాగే ఈ యాప్ ఎలా ఉపయోగించాలో కూడా ఫేస్‌బుక్ గేమింగ్ యాప్ డైరెక్టర్ ఫిద్జీ సిమో తెలిపారు. ఈ యాప్‌లో గో లైవ్ అనే ఫీచర్‌ను ఉపయోగించడం ద్వారా వినియోగదారులు ఇతర మొబైల్ గేమ్స్ స్ట్రీమ్‌లను అప్‌లోడ్ చేసుకోవచ్చు.
ఈ గేమింగ్ యాప్ కొన్ని సాధారణ ఆటలను కలిగి ఉన్నప్పటికీ ప్రధానంగా లైవ్ స్ట్రీమ్ గేమ్ కలిగి ఉంటుంది. అంతేకాకుండా ముఖ్యంగా ఈ యాప్ ప్రారంభంలో ఎటువంటి ప్రకటనలు ఉండవని ఫేస్‌బుక్ ప్రతినిధులు తెలిపారు.
లాటిన్ అమెరికా, ఆగ్రేసియాలో 18 నెలలుగా ఫేస్‌బుక్ ఈ యాప్ వెర్షన్‌లను పరిక్షిస్తోంది. ఈ యాప్ పబ్ జి వంటి గేమింగ్ యాప్ లకు పోటీగా నిలుస్తుందో లేదో చూడాలి మరి.