న్యూఢిల్లీ : సోషల్ మీడియా దిగ్గజం వాట్సాప్‌ అంటే తెలియని వారు ఉండరు, ఉపయోగించని వారు ఉండరు. అయితే ఫేస్ బుక్ యజమాన్యంలోని వాట్సాప్‌ ఎప్పటికప్పుడు యూసర్లకు సరికొత్త అప్ డేట్స్, ఫీచర్స్ తో ఆకట్టుకుంటుంది.

వాట్సాప్‌  ద్వారా మెసేజెస్‌, వాయిస్ కాల్స్, వీడియో కాల్స్‌ లాంటి సేవలను అందిస్తున్నది. అయితే  వాట్సాప్‌ వినియోగదారులకు ఒక గుడ్ న్యూస్ తెలిపింది. కరోనా వైరస్ వ్యాప్తి, లాక్ డౌన్ కారణంగా సామాజిక దూరం పాటించడానికి ప్రజలు ఆన్ లైన్ పేమెంట్లకు మొగ్గు చూపారు.

దీంతో ఆన్ లైన్ పేమెంట్ యాప్స్ వినియోగం భారీగానే పెరిగింది. వాట్సాప్‌ ద్వారా మెసేజెస్, వీడియో కాల్స్ తో పాటు డబ్బులు కూడా పంపొచ్చు. ఈ యాప్ ద్వారా త్వరలో ఇతరులకు మని ట్రాన్స్‌ఫర్‌ చేయవచ్చు.

also read టిక్‌టాక్‌’పై ట్రంప్ డెడ్‌లైన్.. అలా చేయపోతే బ్యాన్ చేస్తాం.. ...

గూగుల్ పే, పేటీఎం, ఫోన్‌పే మాదిరిగా యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (యూపీఐ) సేవలు అందించనుంది. త్వరలోనే ఈ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు సంస్థ ప్రకటించింది.

అంతేకాదు ఆర్బీఐ డేటా లోకలైజేషన్ పేమెంట్స్ నిబంధనలను అనుగుణంగా ఈ స‌ర్వీసులు ఉంటాయ‌ని, దీనికి ఎన్‌పీసీఐ కూడా సుముఖంగా ఉందని పేర్కొంది. పేమెంట్ స‌ర్వీసుల‌ను అందించ‌డానికి ఆర్‌బీఐ నిబంధనలకు అనుగుణంగా ఉండేలా చూసేందుకు ఏడాది కాలంగా తమ బృందం కృషి చేస్తోంద‌ని వాట్సాప్‌ తెలిపింది.

తాజాగా వాట్సాప్‌ 138 ఇమోజీలను యాడ్ చేసింది. మీరు వాట్సాప్‌ పేమెంట్ ఉపయోగించడానికి ముందుగా మే అక్కౌంట్ సంబంధించి ఏ‌టి‌ఎం వివరాలను యాడ్ చేసుకోవాలి తరువాత మీ మొబైల్ నెంబర్  ద్వారా వేరిఫై చేస్తే సరిపోతుంది. తరువాత మీ వాట్సాప్‌ కాంటాక్ట్స్ లో ఎవరికైనా డబ్బులు పంపవచ్చు.

అంతేకాదు మీరు లోకల్ స్టోర్లలో కొనుగోలు చేసే వస్తువులు, సామగ్రి ఇతర వాటికి కూడా వాట్సాప్‌ పేమెంట్ సహకరిస్తుంది.