చైనా యాప్ టిక్‌టాక్ పై డొనాల్డ్ ట్రంప్ డెడ్ లైన్ విధించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్  విలేకరులతో మాట్లాడుతూ చైనా యాప్, షార్ట్ వీడియో యాప్  టిక్‌టాక్ దేశీయ కార్యకలాపాలను మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ లేదా ఇతర యు.ఎస్. కంపెనీకి విక్రయించే ఒప్పందం లేకపోతే టిక్‌టాక్ యాప్ ను సెప్టెంబర్ 15 లోగా యు.ఎస్.లో బ్యాన్ చేయవల్సి ఉంటుంది.

టిక్‌టాక్‌ అమెరికా కార్యకలాపాలను ఒక అమెరికన్ కంపెనీకి విక్రయించడానికి ఆరు వారాల గడువు ఇస్తున్న‌ట్లు తెలిపారు. ఏదైనా ఒప్పందంలో భాగంగా ఫెడరల్ ప్రభుత్వానికి “గణనీయమైన డబ్బు” చెల్లించాల్సి ఉంటుందని ట్రంప్ అన్నారు.

"మైక్రోసాఫ్ట్ లేదా వేరే పెద్ద, సురక్షితమైన, అమెరికన్ కంపెనీ కొనుగోలు చేసినా నాకు ఎలాంటి అభ్యంతరం లేదు" అని ట్రంప్ సోమవారం వైట్ హౌస్ విలేకరులతో అన్నారు.  భద్రతతో తమకు ఎటువంటి సమస్య ఉండకూడదన్నారు. అదేవిధంగా ఈ ఒప్పందం ద్వారా అమెరికా ప్రభుత్వం ఆర్థిక ప్రయోజనం కోరుకుంటున్న‌దని కూడా ట్రంప్‌ చెప్పారు. 

also read ప్రీ-ఆర్డర్లకు భలే డిమాండ్.. వన్‌ప్లస్ నార్డ్ సేల్స్ వాయిదా.. ...

"మైక్రోసాఫ్ట్ లేదా ఇతర పెద్ద సంస్థలతో ఒప్పందం చేసుకోగలిగితే తప్ప లేదంటే సెప్టెంబర్ 15 తరువాత టిక్‌టాక్ ను బ్యాన్ చేయవల్సి ఉంటుంది" అన్నారు.  ట్రంప్ శుక్రవారం చైనా యాజమాన్యంలోని యాప్ టిక్‌టాక్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైరల్ వీడియో అప్లికేషన్‌ టిక్‌టాక్ కార్యకలాపాలను కొనుగోలు చేయడానికి తన సంస్థ చేస్తున్న ప్రయత్నాల గురించి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో  మైక్రోసాఫ్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సత్య నాదెల్లా మాట్లాడారు.

మైక్రోసాఫ్ట్ ఒక బ్లాగ్ పోస్ట్‌లో యు.ఎస్., అలాగే కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో టిక్‌టాక్ కార్యకలాపాల కోసం సెప్టెంబర్ 15 లోపు ఒప్పందాన్ని పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది.

టిక్‌టాక్ రెండు వేర్వేరు కంపెనీల యాజమాన్యంలో ఉంటే కంపెనీ పేరుకు ఎవరు హక్కులు పొందుతారని ట్రంప్ ప్రశ్నించారు. "30% కొనడం కంటే వారు మొత్తం కొనడం మంచిదని నా వ్యక్తిగత అభిప్రాయం" అని ట్రంప్ అన్నారు. టిక్‌టాక్‌ను కొనుగోలు చేయనున్నట్టు ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.