అందరూ ఎంతగాను ఎదురుచూస్తున్న ఆపిల్ ఐఫోన్ 12 స్మార్ట్‌ఫోన్‌ పై సస్పెన్స్ విడింది. సరికొత్త ఆపిల్  ఐఫోన్ 12 మోడల్స్ ని రెండు రోజుల క్రితం వర్చువల్ ఈవెంట్‌లో ప్రకటించారు. ఖర్జులను తగ్గించుకునేందుకు 2021 నుండి చార్జర్ లేకుండా మొబైల్ ఫోన్లను విక్రయించాలని కొన్ని కంపెనీలు ఇప్పటికే సన్నాహాలు చేస్తున్నాయి.

తాజాగా ఆపిల్ ఐఫోన్ 12లో ఇయర్‌ ఫోన్స్‌ తో పాటు, చార్జర్‌ ను కూడా ఇవ్వడం లేదని స్పష్టం చేసింది. ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ  శామ్సంగ్ ఐఫోన్ 12 స్మార్ట్‌ఫోన్‌లతో ఛార్జర్‌ను విక్రయించక పోవడాన్ని ట్రోల్ చేస్తూ సోషల్ మీడియా లో పోస్ట్ పెట్టింది.

also read అక్టోబర్ 19న ఒప్పో మొట్టమొదటి స్మార్ట్ టీవీ.. ఫీచర్స్, ధర, ప్రత్యేకతలు మీకోసం.. ...

ఇదీ కాస్త ఇంటర్నెట్ లో వైరల్ కావడంతో కొందరు ఆపిల్  యూజర్లు అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆపిల్ అతిపెద్ద పోటీ సంస్థ శామ్సంగ్  చేసిన పోస్టులో ఆపిల్ సంస్థను ఎగతాళి చేసినట్టు కనిపిస్తుంది.

 శాంసంగ్ చేసిన పోస్టులో "మీరు ఏం కోరుకుంటారో అది శామ్సంగ్ ఇస్తుంది, ముఖ్యంగా చార్జర్, బెస్ట్ కెమెరా, మంచి బ్యాటరీ ఇంకా అన్ని ఇస్తున్నామంటూ పోస్ట్ పెట్టింది.  దీంతో పాటు గెలాక్సీ ఫోన్‌ల  బ్లాక్ ఛార్జర్  ఫోటోను కూడా షేర్ చేసింది.

శామ్సంగ్  చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో భారీగా వైరల్ అయ్యింది. ఈ పోస్ట్ కి 70వేల లైక్స్, 10వేల కంటే ఎక్కువ కమెంట్స్ వచ్చాయి. కొందరైతే ఫన్నీగా ఎమోజీస్ యాడ్ చేస్తూ కామెంట్స్ పోస్ట్ చేశారు.