చైనా స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఒప్పో స్మార్ట్ టీవీ విభాగంలోని ప్రవేశించనుంది. మొట్టమొదటి ఒప్పో స్మార్ట్ టీవీ లాంచ్ అక్టోబర్ 19 న సెట్ కానుందని ఒక  టీజర్ ద్వారా కంపెనీ వెల్లడించింది. చైనాలోని షాంఘైలో ఈ లాంచ్ ఈవెంట్ జరగనుందని ఒప్పో ప్రకటించింది.

అధికారిక టీజర్ ద్వారా ఒప్పో స్మార్ట్ టీవీ సైజ్ గురించి ఎటువంటి వివరాలను అందించలేదు. స్మార్ట్ టివి 55, 65-అంగుళాల స్క్రీన్ పరిమాణాలలో రానున్నాంట్లు ఊహిస్తున్నారు.

ఒప్పో స్మార్ట్ టీవీ కూడా వీడియో కాన్ఫరెన్సింగ్ కోసం పాప్-అప్ కెమెరాతో వచ్చే అవకాశం ఉంది. దీని ఆడియో సిస్టంను డానిష్ ఆడియో బ్రాండ్ రూపొందించింది. వీళ్లు ఈ కంపెనీకి గతంలో కూడా పనిచేశారు.

టీజర్ ప్రకారం ఒప్పో స్మార్ట్ టీవీ లాంచ్ అక్టోబర్ 19 న చైనాలో జరుగుతోంది.  గత నెలలో జరిగిన ఒప్పో డెవలపర్ కాన్ఫరెన్స్ (ఒడిసి) 2020 లో స్మార్ట్ టివి మార్కెట్లో కంపెనీ ప్రవేశిస్తున్నట్లు అధికారికంగా తెలిపింది.

also read  హైదరాబాద్‌లో ఇంటెల్‌ ఏఐ రిసెర్చ్‌ సెంటర్‌ ఏర్పాటు . ...

అయితే స్మార్ట్ టీవీ లాంచ్ గురించి ఎక్కువ వివరాలను అందించలేదు. కానీ ఆన్‌లైన్ రిటైల్ పర్ట్నర్ జెడి.కామ్ సైట్‌లో  55, 65-అంగుళాల స్మార్ట్ టీవీని ప్రారంభించటానికి సిద్ధంగా ఉందని ధృవీకరించింది.

స్మార్ట్ టీవీ రెండు వెర్షన్లలో రాబోతున్నట్లు, ఒకటి ఒప్పో స్మార్ట్ టీవీ ఆర్1 55-అంగుళాలు, మరొకటి ఒప్పో స్మార్ట్ టీవీ ఎస్1 65-అంగుళాలు అని సమాచారం.

ఒప్పో వాచ్ లీగ్ ఆఫ్ లెజెండ్స్ లిమిటెడ్ ఎడిషన్ కొత్త స్మార్ట్ టీవీలతో  వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ లాంచ్‌లో కూడా చేసే అవకాశం ఉంది. ఒప్పో స్మార్ట్ టీవీ క్వాంటం డాట్ డిస్ప్లే ప్యానల్‌తో పాటు 4కె రిజల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది.  

మేలో రియల్‌మీ 32, 43-అంగుళాల ఆండ్రాయిడ్ టీవీ వెర్షన్లను విడుదల చేయడం ద్వారా స్మార్ట్ టీవీ మార్కెట్లోకి ప్రవేశించింది. రియల్‌మీ స్మార్ట్ టీవీ ప్రారంభ ధర రూ. 12,999. రియల్‌మీ స్మార్ట్ ఎస్‌ఎల్‌ఇడి టివిని 55 అంగుళాల సైజ్ లో విడుదల చేయడంతో కంపెనీ స్మార్ట్ టివి పోర్ట్‌ఫోలియోను విస్తరించింది.