కరోనా వైరస్ వ్యాప్తి చెందడం ప్రారంభించినప్పటి నుంచి వర్క్ ఫ్రోం హొం, ఆన్లైన్ క్లాసెస్, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ బాగా పెరిగిపోయాయి. ఎందుకంటే కారణం సామాజిక దూరం పాటించడం కోసం. కరోనా వైరస్ సొకకుండా  స్కూల్స్, కార్యాలయాలు మూసివేయవలసి రావడంతో, ప్రతిదీ ఆన్‌లైన్‌లోకి మారింది.

ఇలాంటి సమయంలో స్మార్ట్‌ఫోన్ విలువైనదిగా మారింది. తాజా వార్తల నుంచి ఆన్‌లైన్ తరగతులకు హాజరు కావడం వరకు మీరు స్మార్ట్‌ఫోన్‌ ద్వారా  ప్రతి దాని గురించి తెలుసుకోవచ్చు.

ఆన్‌లైన్ క్లాసెస్ కోసం వీడియో కాల్స్ చేయడానికి టాబ్లెట్‌లు కూడా గొప్ప డివైజె. ఫిట్‌నెస్, ఫిట్‌నెస్-ట్రాకింగ్ డివైజెస్ కూడా చాలా మందికి హాట్ ఫేవరెట్ గా మారాయి. ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ శామ్‌సంగ్ మరోసారి ‘శాంసంగ్ డేస్’ సేల్ అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో మంగళవారం (జూన్ 9) నుంచి 12 వరకు నాలుగు రోజులపాటు కొనసాగనుంది. 

 భారతదేశంలో శామ్సంగ్ అత్యంత పాపులర్ అయిన  గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌లపై ఇప్పుడు డిస్కౌంట్ ధరలతో పాటు జీరో ఈ‌ఎం‌ఐ ఆప్షన్, హెచ్‌డి‌ఎఫ్‌సి బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులపై క్యాష్‌బ్యాక్ ఆఫర్లు అందిస్తుంది.

also read ఫ్లిప్‌కార్ట్‌ యాప్‌లో అదిరిపోయే కొత్త ఫీచర్‌..వారికి మాత్రమే..

మీరు మీ స్మార్ట్‌ఫోన్‌ను అప్‌గ్రేడ్ చేసుకోవాలని లేదా కొత్త స్మార్ట్ ఫోన్ కొనడానికి వేచి చూస్తున్నారా, అయితే ఫ్లిప్‌కార్ట్‌లో శామ్‌సంగ్ డేస్ సేల్ మీకు మంచి  అవకాశం. అలాగే, శాంసంగ్ కేర్ ప్లస్, యాక్సిడెంటల్, లిక్విడ్ డ్యామేజ్ ప్రొటెక్షన్ ప్లాన్లు కూడా లభ్యం.

శాంసంగ్ గెలాక్సీ ఎస్20 అల్ట్రా, ఎస్20ప్లస్, గెలాక్సీ ఎస్20, గెలాక్సీ నోట్ 10 లైట్, గెలాక్సీ నోట్ 10 ప్లస్, గెలాక్సీ ఎస్ 10 లైట్ వంటి వాటితోపాటు ఇతర స్మార్ట్‌ఫోన్లపై ఆకర్షణీయమైన తగ్గింపు లభిస్తోంది. 

శాంసంగ్ గెలాక్సీ ఎస్20 అల్ట్రా, గెలాక్సీ ఎస్20ప్లస్, ఎస్ 20 కొనుగోళ్లపై హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డును ఉపయోగించి కొనుగోలుపై రూ .4,000 క్యాష్‌బ్యాక్.  12 నెలల నో-కాస్ట్ ఇఎంఐ ఆఫర్‌. శాంసంగ్ కేర్ + ప్లాన్‌ను  రూ .2,499   అందిస్తుంది.


జూన్ 9 నుండి జూన్ 12 వరకు ఫ్లిప్‌కార్ట్‌లో సామ్‌సంగ్ డేస్ సేల్ సందర్భంగా భారతదేశంలో సామ్‌సంగ్ స్మార్ట్‌వాచ్‌లు, ఫిట్‌నెస్ బ్యాండ్‌లు కూడా తగ్గింపు ధరకే లభిస్తున్నాయి.