Asianet News TeluguAsianet News Telugu

ఫ్లిప్‌కార్ట్‌ యాప్‌లో అదిరిపోయే కొత్త ఫీచర్‌..వారికి మాత్రమే..

ఫ్లిప్‌కార్ట్ కొత్త ఫీచర్‌తో వినియోగదారులకు షాపింగ్‌ చేయడంలో మరింత ఉపయోగపడుతుంది. ఈ ఏ‌ఐ ప్లాట్‌ఫారమ్‌ను ఫ్లిప్‌కార్ట్   ఇంటర్నల్ టెక్నికల్ బృందం అభివృద్ధి చేసింది. ప్రస్తుతం మొబైల్‌ ఫోన్‌లోని ఫ్లిప్‌కార్ట్‌ యాప్‌లో వాయిస్‌ అసిస్టెంట్‌ను పరిచయం చేయనుంది. 

flip kart adds  new feature voice assistant  for  android user
Author
Hyderabad, First Published Jun 9, 2020, 5:42 PM IST

ప్రముఖ ఈ- కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ సరికొత్త  ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. తమ  వినియోగదారుల సేవలను మరింత సులభతరంగా చేసేందుకు కొత్తగా  ఏ‌ఐ వాయిస్ అసిస్టెంట్‌ను పరిచయం చేసింది. ఈ వాయిస్ అసిస్టెంట్ ప్రస్తుతం ఇంగ్లీష్, హిందీలలో ఇచ్చే ఆదేశాలను అర్థం చేసుకోగలదు. అయితే భవిష్యత్తులో తెలుగు భాషకి కూడా అర్ధం చేసుకునేలా కంపెనీ యోచిస్తోంది.

ఫ్లిప్‌కార్ట్ కొత్త ఫీచర్‌తో వినియోగదారులకు షాపింగ్‌ చేయడంలో మరింత ఉపయోగపడుతుంది. ఈ ఏ‌ఐ ప్లాట్‌ఫారమ్‌ను ఫ్లిప్‌కార్ట్   ఇంటర్నల్ టెక్నికల్ బృందం అభివృద్ధి చేసింది. ప్రస్తుతం మొబైల్‌ ఫోన్‌లోని ఫ్లిప్‌కార్ట్‌ యాప్‌లో వాయిస్‌ అసిస్టెంట్‌ను పరిచయం చేయనుంది. వాయిస్ అసిస్టెంట్ ద్వారా షాపింగ్ అనుభవాన్ని మరింత సహజంగా చేస్తుంది అని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది.

ఒక పత్రికా ప్రకటన ప్రకారం, వాయిస్ అసిస్టెంట్‌ను ఫ్లిప్‌కార్ట్‌ గ్రాసరీ స్టోర్‌లో, సూపర్‌ మార్ట్‌లో ఉపయోగించవచ్చు.  ఫ్లిప్‌కార్ట్ గత సంవత్సరం ఫ్లిప్‌కార్ట్ సాతి పేరుతో స్మార్ట్ అసిస్టివ్‌ ఇంటర్‌ఫేస్‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.  వాయిస్ అసిస్టెంట్‌ ద్వారా ఉత్పత్తులు, ఉత్పత్తి వివరాలు, ఆర్డర్ చేయడం ఇంకా మరిన్ని పనులు చేయగలదు.

also read బడ్జెట్ ధరకే వన్‌ప్లస్ స్మార్ట్ టీవీలు...జూలై 2న లాంచ్

ఇది వినియోగదారులు మాట్లాడే భాషను స్వయంగా గుర్తించగలదని, షాపింగ్‌కు సంబంధించిన సంభాషణను అర్థం చేసుకొని వినియోగదారులకు సహకారం అందిస్తుందని కూడా తెలిపింది. దీనిపై కస్టమర్ల అభిప్రాయాలు తెలుసుకోవడానికి వివిధ పట్టణాలు, నగరాలలో ఐదు నెలలకు పైగా పరిశోధన చేసినట్లు కూడా ఫ్లిప్‌కార్ట్‌ తెలిపింది.

వినియోగదారులు ఏ ఉత్పత్తి కోసం చూస్తున్నారో వారు వాయిస్ అసిస్టెంట్ ద్వారా కనుగొనొచ్చు. అలాగే వాయిస్ అసిస్టెంట్ ఉపయోగించి ఉత్పత్తి సమాచారాన్ని కూడా పొందవచ్చు.

ప్రస్తుతానికి, వాయిస్ అసిస్టెంట్ ఆండ్రాయిడ్ డివైజెస్ లోని సూపర్ మార్ట్ యాప్ ఉపయోగించే ఇంగ్లీష్, హిందీ మాట్లాడే వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్ భవిష్యత్తులో ఐ‌ఓ‌ఎస్ తో పాటు వెబ్‌సైట్‌లో భవిష్యత్తులో ఇది అందుబాటులోకి రానుంది అని తెలిపారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios