రిలయన్స్ జియో జియోఫోన్ వినియోగదారుల కోసం అత్యంత తక్కువగల రెండు ప్లాన్ లను నిలిపివేసింది. నిలిపివేసిన ప్లాన్లు రూ .49 మరియు రూ .69 అయితే ఇవి ఫిబ్రవరిలో ప్రవేశపెట్టింది.

రూ .49 ప్లాన్: ఈ ప్లాన్ 14 రోజుల వాలిడిటీతో 2 జిబి డేటా వచ్చేది. ఈ ప్లాన్ తో 25 ఉచిత ఎస్ఎంఎస్, ఉచిత ఆన్ లిమిటెడ్ జియో నుండి జియో కాలింగ్, 250 నిమిషాలు జియో నుండి నాన్ జియో కాలింగ్ అందించింది. ఈ ప్లాన్ జియో యాప్స్ కోసం కాంప్లిమెంటరీ యాక్సెస్‌ను కూడా తీసుకువచ్చింది.

రూ .69 ప్లాన్: ఈ ప్లాన్ కూడా 14 రోజుల వాలిడిటీతో 7 జిబి డేటాను ఇచ్చింది. ఈ ప్లాన్ తో 25 ఉచిత ఎస్ఎంఎస్, ఉచిత ఆన్ లిమిటెడ్ జియో నుండి జియో కాలింగ్, 250 నిమిషాల జియో నుండి నాన్ జియో కాలింగ్ అందించింది. ఈ ప్లాన్ జియో యాప్స్ కి  కాంప్లిమెంటరీ యాక్సెస్‌ను కూడా అందించింది.

తక్కువ వాలిడిటీతో పేరుగాంచిన రూ .69  ప్లాన్‌లను నిలిపివేసిన తరువాత, జియోఫోన్ వినియోగదారుల కోసం రిలయన్స్ జియో రూపొందించిన అత్యంత సరసమైన కొత్తా ప్లాన్ రూ.75 ప్రవేశపెట్టింది. రూ .69 ప్లాన్‌ను ఎంచుకునే వినియోగదారులు అదనంగా ఆరు రూపాయలు చెల్లించి అవే మొత్తం ప్రయోజనాలను పొందవచ్చు. రిలయన్స్ జియో వెబ్‌సైట్‌లో జియో ఆల్ ఇన్ వన్ ప్లాన్ కింద జియోఫోన్ కేటగిరీ కింద ఈ ప్లాన్ జాబితా చేయబడింది. సిమ్ కార్డ్ జియోఫోన్‌లో ఉంటేనే కింది ప్లాన్ పనిచేస్తాయని వినియోగదారులు గమనించాలి.

also read  20వేలలో లభించే సూపర్ హిట్ బెస్ట్ స్మార్ట్ ఫోన్ ఇదే..

రూ .75 ప్లాన్: ఈ ప్లాన్ 28 రోజుల వాలిడిటీతో 3 జిబి డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్ తో 50 ఉచిత ఎస్ఎంఎస్, ఉచిత ఆన్ లిమిటెడ్ జియో నుండి జియో కాలింగ్, 500 నిమిషాల జియో నుండి నాన్ జియో కాలింగ్ తీసుకువచ్చింది. ఈ ప్లాన్  జియో  యాప్స్ కి కాంప్లిమెంటరీ యాక్సెస్‌ను కూడా ఇస్తుంది.

రూ .125 ప్లాన్: ఈ ప్లాన్ 28 రోజుల వాలిడిటీతో 14 జిబి డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్ తో 300 ఉచిత ఎస్ఎంఎస్, ఉచిత ఆన్ లిమిటెడ్ జియో నుండి జియో కాల్స్, 500 నిమిషాల జియో నుండి నాన్ జియో కాలింగ్ తెస్తుంది. ఈ ప్లాన్  జియో యాప్స్ కోసం కాంప్లిమెంటరీ యాక్సెస్‌ను కూడా ఇస్తుంది.

రూ .155 ప్లాన్: ఈ ప్లాన్ 28 రోజుల వాలిడిటీతో 28 జిబి డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్ రోజుకు 1జి‌బి హై-స్పీడ్ డేటాను అందిస్తుంది. తరువాత స్పీడ్ 64 కే‌బి‌పి‌ఎస్ కు పడిపోతుంది. ఈ ప్లాన్ తో రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్, ఉచిత ఆన్ లిమిటెడ్ జియో కాలింగ్, 500 నిమిషాల జియో నుండి నాన్ జియో కాలింగ్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్ జియో  యాప్స్ కాంప్లిమెంటరీ యాక్సెస్‌ను కూడా అందిస్తూంది.

రూ .185 ప్లాన్: ఈ ప్లాన్ 56 జీబీ డేటాను 28 రోజుల వాలిడిటీతో అందిస్తుంది. ఈ ప్లాన్ రోజుకు 2జి‌బి హై-స్పీడ్ డేటాను అందిస్తుంది, తరువాత స్పీడ్ 64 కే‌బి‌పి‌ఎస్ కు పడిపోతుంది. ఈ ప్లాన్ తో రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్, ఉచిత ఆన్ లిమిటె జియో నుండి జియో కాలింగ్, 500 నిమిషాల జియో నుండి నాన్ జియో కాలింగ్ చేసుకోవచ్చు. ఈ ప్రణాళిక   జియో  యాప్స్ కాంప్లిమెంటరీ యాక్సెస్‌ను కూడా తెస్తుంది.