రిలయన్స్ జియో కొత్త లేటెస్ట్ రిచార్జ్ ప్లాన్... ఇతర నెట్వర్క్ల కంటే చౌకగా...

సంచలనాల జియో మరో సెన్సేషన్ క్రియేట్ చేసింది. రూ. 2121 పేరిట నూతన రీచార్జీ ప్లాన్ ప్రకటించిన రిలయన్స్ జియో.. వాలిడిటీ గడువును 365 రోజుల నుంచి 336 రోజులకు కుదించింది. ఇప్పటి వరకు అమల్లో ఉన్న రూ.2020 పథకాన్ని తొలిగించింది. మిగతా సంస్థల ప్లాన్లతో పోలిస్తే జియో వార్షిక ప్లాన్ చౌకే
 

relaince jio yearly plan for prepaid users has changed

న్యూఢిల్లీ: దేశీయ టెలికం మార్కెట్లోకి ‘సునామీ’లా దూసుకొచ్చి సరసమైన టారిఫ్‌ ప్లాన్లతో కేవలం మూడేండ్లలోనే ఎంతోమందికి చేరువవడంతోపాటు అతిపెద్ద నెట్‌వర్క్‌ ఆపరేటర్‌గా ఆవిర్భవించిన రిలయన్స్‌ జియో తమ ప్రీపెయిడ్‌ ఖాతాదారుల కోసం సరికొత్త దీర్ఘకాలిక ప్లాన్‌ను ప్రకటించింది. 

జియో కొత్త ప్రీపెయిడ్‌ ప్లాన్‌ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. దీర్ఘకాలిక గడువు గల ప్లాన్‌ కోరుకునే వారి కోసం దీన్ని ప్రకటించింది. 336 రోజుల వ్యాలిడిటీ కలిగిన ఈ ప్లాన్‌ ధర రూ.2,121గా నిర్ణయించింది. 

also read సెర్చింజన్ వేటు: ప్లే స్టోర్ నుంచి ఫ్రాడ్ 600 యాప్‌ల తొలగింపు

ఈ ప్లాన్ ఈ ఏడాది నూతన సంవత్సర దినోత్సవం సందర్భంగా ప్రకటించిన ‘2020 ప్లాన్‌’ను పోలి ఉంది. ఈ ప్లాన్ కింద రీ చార్జీ చేసుకున్న వారికి జియో నుంచి లాంగ్‌టర్మ్‌ ప్లాన్‌ వినియోగ దారులకు రోజుకు 1.5 జీబీ హైస్పీడ్‌ డేటా అందిస్తుంది.

జియో నుంచి జియో, ల్యాండ్‌ లైన్‌కు అపరిమిత వాయిస్‌ కాల్స్‌ చేసుకోవచ్చు. జియోయేతర కాల్స్‌ మాట్లాడుకోవడానికి 12వేల నిమిషాలు అందిస్తున్నారు. రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు పంపు కోవచ్చు.

relaince jio yearly plan for prepaid users has changed

జియో టీవీ, జియో సినిమా, జియో న్యూస్‌ సబ్‌స్క్రిప్షన్‌ ఉచితంగా ఈ ప్లాన్‌ కింద లభిస్తుంది. జియో యాప్‌తోపాటు, గూగుల్‌పే, పేటీఎం వంటి థర్డ్‌ పార్టీ యాప్స్‌లోనూ ఈ ప్లాన్‌ లభ్యమవుతోంది. నూతన సంవత్సరం సందర్భంగా జియో ప్రకటించిన 2020 ప్లాన్‌ సైతం ఇవే ప్రయోజనాలు కలిగి ఉన్నా ఆ ప్లాన్‌ వ్యాలిడిటీని 365 రోజులుగా ప్రకటించింది. లిమిటెడ్‌ పిరియడ్‌ ఆఫర్‌ కింద ఈ ప్లాన్‌ను జియో అందించింది. 

also read ఏజీఆర్ చెల్లింపుల్లో వడ్డీ ఫైన్‌లే రూ.70 వేల కోట్లు: టెలికంశాఖ కుండబద్ధలు

గత ఏడాది డిసెంబర్‌లో పరిమిత కాల ఆఫర్‌గా 365 రోజుల వాలిడిటీతో తీసుకొచ్చిన "2020 హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్"  రూ. 2,020 ప్రీపెయిడ్ ప్లాన్‌ను తొలగించింది. దీంతో పాటు తన యాప్ లో కొన్ని ప్లాన్ల కేటగిరీలను కూడా జియో మార్చడం గమనార్హం.

జియో టీవీ, జియో సినిమా, జియో న్యూస్‌ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా అందజేస్తున్నా పాత ప్లాన్‌తో పోలిస్తే కొత్త ప్లాన్‌ చెల్లుబాటు గడువును 29 రోజులు కుదించింది. కానీ రూ.2,399 ధరకు వొడాఫోన్‌, రూ.2,398 ధరతో ఎయిర్‌టెల్‌ అందజేస్తున్న వార్షిక ప్లాన్లతో పోలిస్తే జియో ప్లాన్‌ చవకే. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios