Asianet News TeluguAsianet News Telugu

రియల్‌ మీ కొత్త స్మార్ట్ వాచ్.. 14 రకాల స్పోర్ట్ మోడ్‌ ఫీచర్లతో లాంచ్...

రియల్‌ మీ స్మార్ట్ టీవీతో పాటు మే 25 న ఆన్‌లైన్ ఈవెంట్ ద్వారా రియల్‌ మీ వాచ్ ఇండియాలో అందుబాటులోకి వస్తుంది. రియల్ మీ స్మార్ట్ టీవీ గురించి వివరాలు తెలిపిన తరువాత, చైనా సంస్థ రియల్ మీ ఇప్పుడు స్మార్ట్ వాచ్ సంబంధించి కొన్ని ఫీచర్లను వెల్లడించింది.  
 

real me set to launch smartwatch with the smart tv in india
Author
Hyderabad, First Published May 21, 2020, 3:58 PM IST

భారతదేశంలో మే 25 న జరగాబోయే ఆన్‌లైన్ ఈవెంట్ కార్యక్రమంలో స్మార్ట్ ఫోన్ కంపెనీ రెండు కొత్త ఉత్పత్తులను అధికారికంగా లాంచ్ చేయనుంది. ఈ ఈవెంటులో రియల్‌ మీ టీవీతో పాటు  రియల్‌ మీ స్మార్ట్ వాచ్‌లను ప్రారంభించనుంది. ఇప్పుడు, లాంచ్ ఈవెంట్‌కు ముందుగానే  రియల్‌ మీ కొత్త ఉత్పత్తుల వివరాలను అధికారికంగా వెల్లడించింది.

రియల్ మీ స్మార్ట్ టీవీ గురించి వివరాలు తెలిపిన తరువాత, చైనా సంస్థ రియల్ మీ ఇప్పుడు స్మార్ట్ వాచ్ సంబంధించి కొన్ని ఫీచర్లను వెల్లడించింది.  కంపెనీ ఇండియా వెబ్‌సైట్‌లోని ప్రకారం రియల్‌ మీ వాచ్ ఆపిల్ వాచ్, ఎం‌ఐ వాచ్ లాగా స్కైర్ ఆకారపు డయల్‌తో వస్తుంది.

ఈ స్మార్ట్ వాచ్ 1.4-అంగుళాల పెద్ద కలర్ టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే  కలిగి ఉంటుంది, గొప్ప విషయం ఏంటంటే బడ్జెట్ విభాగంలో పెద్ద స్క్రీన్‌ను కలిగి ఉన్న మొదటి స్మార్ట్ వాచ్ ఇదే.

also read బెజెల్‌లెస్‌ డిజైన్‌తో తక్కువ ధరకే షియోమి స్మార్ట్ టీవీలు ...

రియల్‌ మీ స్మార్ట్‌వాచ్ కస్టమైజ్ వాచ్ బ్యాండ్‌లు, వాచ్ ఫేస్‌లకు సపోర్ట్ ఇస్తుందిచేస్తుంది. నీలం, నారింజ, ఆలివ్ గ్రీన్, నలుపు రంగు వంటి కలర్ ఆప్షన్స్ ఉంటాయి. ఈ వాచ్ బ్యాండ్‌లు  క్లాసిక్, ఫ్యాషన్ అనే రెండు ఆప్షన్స్ తో వస్తుంది. వాచ్ డయల్ కుడి వైపున ఉన్న బటన్‌ను నావిగేషన్ కోసం ఉపయోగించుకోవచ్చు.

ఈ స్మార్ట్ వాచ్  ఫుట్‌బాల్, బాస్కెట్‌ బాల్, టేబుల్ టెన్నిస్, బైక్, స్పిన్నింగ్, ఎలిప్టికల్, యోగా, క్రికెట్, రన్నింగ్, వాకింగ్, ట్రెడ్‌మిల్, బ్యాడ్మింటన్, ఏరోబిక్, ఫిట్‌నెస్ వంటి 14 స్పోర్ట్ మోడ్‌లకు సపోర్ట్ ఇస్తుందని తెలిపారు. హార్ట్ బీట్ రేటు మానిటర్, బ్లడ్-ఆక్సిజన్ లెవెల్  మానిటర్ వంటి రియల్ టైమ్ ఆరోగ్యాన్ని పర్యవేక్షించడానికి  24x7 హెల్త్ అసిస్టెంట్‌తో వస్తుంది.

రియల్‌ మీ వాచ్ మ్యూజిక్, కెమెరా యాప్ లను కంట్రోల్ చేయగలదు. ఆల్ ఇన్ వన్ రియల్‌ మీ లింక్ స్మార్ట్ యాప్ ద్వారా పని చేస్తుంది. వీటితో పాటు, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్, వాట్సాప్, ఎస్‌ఎంఎస్ ఇంకా మరిన్ని యాప్ ద్వారా స్మార్ట్ నోటిఫికేషన్‌లకు స్మార్ట్‌వాచ్ సపోర్ట్  ఇస్తుంది.

ఇతర వివరాల విషయానికొస్తే, రియల్‌ మీ వాచ్ 160 ఎంఏహెచ్ బ్యాటరీ, వేర్‌ఓఎస్‌తో పనిచేస్తుందని భావిస్తున్నారు. ఇది ఐ‌పి 68 వాటర్, డస్ట్  రెసిస్టంట్ కలిగి ఉంది.

Follow Us:
Download App:
  • android
  • ios