న్యూఢిల్లీ: ప్రముఖ  చైనా స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్ షియోమి రెడ్‌మి కొత్త ఎక్స్ సిరీస్ స్మార్ట్‌టీవీలను లాంచ్‌ చేయబోతుంది. ప్రస్తుతం కరోనా సంక్షోభ సమయంలో మూడు స్మార్ట్ టీవీలను చైనాలో జరగబోయే లాంచ్ ఈవెంట్‌లో  ఆవిష్కరించనుంది.

రెడ్‌మి టీవీ ఎక్స్50, రెడ్‌మి ఎక్స్ 55, రెడ్‌మి ఎక్స్ 65 స్మార్ట్ టీవీలను  కంపెనీ  మే 26వ తేదీన లాంచ్ చేయనుంది. ఈ టీవీలను ఎక్స్ సిరీస్ కింద విక్రయించనుంది. దీంతోపాటు   రెడ్ మీ 10ఎక్స్ సిరీస్ స్మార్ట్ ఫోన్లను కూడా లాంచ్ చేయనుందని సమాచారం.

also read గూగుల్ లో నెటిజన్లు ఎక్కువగా వేటికోసం వెతికారో తెలుసా?!

షియోమి బ్రాండ్ నుండి రెండు స్మార్ట్ టీవీఅంతకుందే చైనాలో అమ్మకాలు ప్రారంభించాయి. బెజెల్‌  లెస్‌ డిజైన్‌ తో చిన్న సైజులో టీవీలను సరసరమైన ధరకు అందుబాటులో తీసుకురానుందని సమాచారం.  

ఈ టీవీల సైజ్ గురించి తప్ప వీటికి సంబంధించిన మరే సమాచారం అందుబాటులో లేదు.  ఈ టీవీలు డిజైన్, పిక్చర్ క్వాలిటీ , సౌండ్ క్వాలిటీలో మెరుగ్గా వుంటాయని మాత్రమే రెడ్‌మి చెప్పింది. అలాగే  ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో భారతదేశంలో వీటిని లాంచ్‌ చేసే అవకాశం వుందని భావిస్తున్నారు.

వన్ ప్లస్ బ్రాండ్ కూడా తాజాగా స్మార్ట్‌ టీవీల రంగంలోకి ప్రవేశించనుంది.