Asianet News TeluguAsianet News Telugu

బడ్జెట్ ధరకే అదిరిపోయే ఫీచర్లతో పోకో ఎం2 కొత్త స్మార్ట్‌ఫోన్‌..

పోకో ఎం2 పేరుతో వస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్ సెప్టెంబర్ 8న లాంచ్ అయ్యింది. పోకో ఎం2 సెప్టెంబర్ 8 మంగళవారం రోజున లాంచ్‌కు ముందే కొన్ని టీజర్‌లు కూడా వచ్చాయి. 

Poco M2 with Quad Rear Cameras, 5,000mAh Battery Launched in india
Author
Hyderabad, First Published Sep 9, 2020, 12:19 PM IST

చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షియోమి సబ్ బ్రాండ్ పోకో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారతీయ మార్కెట్లోకి తీసుకువచ్చింది. పోకో ఎం2 పేరుతో వస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్ సెప్టెంబర్ 8న లాంచ్ అయ్యింది.

పోకో ఎం2 సెప్టెంబర్ 8 మంగళవారం రోజున లాంచ్‌కు ముందే కొన్ని టీజర్‌లు కూడా వచ్చాయి. అయితే  జూలైలో ఇండియాలో లాంచ్ అయిన పోకో ఎం 2 ప్రోకు ఈ స్మార్ట్ ఫోన్ కొత్త వెర్షన్ కావచ్చు.

పోకో ఎం2 వాటర్‌డ్రాప్-స్టయిల్  నాచ్ డిజైన్‌తో పాటు ఫుల్-హెచ్‌డి + డిస్‌ప్లేతో ఉంటుంది. కొత్త స్మార్ట్‌ఫోన్ క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌తో పాటు ఎల్‌ఈడీ ఫ్లాష్‌ కూడా ఉంది. ఫోన్ వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో పోకో ఎం 2 ప్రో కొత్తగా కపిస్తుంది.

also read  కలర్ టచ్ స్క్రీన్ డిస్‌ప్లేతో రెడ్‌మి కొత్త స్మార్ట్ బ్యాండ్.. రేపే లాంచ్.. ...

 పోకో ఎం2లోని 5,000mAh బ్యాటరీ ఒకే ఛార్జీతో రెండు రోజుల పాటు ఉంటుంది. 6.53 అంగుళాల స్ర్రీన్, 1080x2340 పిక్సెల్స్  రిజల్యూషన్, ఆండ్రాయిడ్ 10  ఓఎస్, మీడియాటెక్ హెలియో జి 80ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్,  64 జీబీ స్టోరేజ్, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 13+ 8+5+2మెగాపిక్సెల్ క్వాడ్  రియర్ కెమెరా ఉన్నాయి.

6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ఇంకా 128 జీబీ స్టోరేజ్ వేరియంట్లలో తీసుకొచ్చింది. బేస్ వేరియంట్ ధర రూ. 10,999 ఉండగా టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 12,499.

పోకో ఇండియా మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు వర్చువల్ ఈవెంట్ ద్వారా ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది.  సెప్టెంబర్ 15 నుండి మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్‌కార్ట్ ద్వారా  కొనుగోలు చేయవచ్చు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios