Asianet News TeluguAsianet News Telugu

కలర్ టచ్ స్క్రీన్ డిస్‌ప్లేతో రెడ్‌మి కొత్త స్మార్ట్ బ్యాండ్.. రేపే లాంచ్..

ఈ ఫిట్‌నెస్ బ్యాండ్ కలర్ స్క్రీన్  టచ్ డిస్‌ప్లేతో వస్తుంది. సులభంగా ఛార్జింగ్ చేయడానికి ఇంటిగ్రేటెడ్ యుఎస్‌బి ప్లగ్‌ కూడా ఉంది. రెడ్‌మి స్మార్ట్ బ్యాండ్ హార్ట్ బీట్ సెన్సార్, స్లీప్ క్వాలిటి  ట్రాకింగ్‌ ను చూపిస్తుంది.

Redmi launches Smart Band With Colour Display, Heart-Rate Monitor in india
Author
Hyderabad, First Published Sep 8, 2020, 6:38 PM IST

షియోమి సబ్ బ్రాండ్ రెడ్‌మి స్మార్ట్ బ్యాండ్ ను ఇండియలో లాంచ్ చేసింది. ఈ ఫిట్‌నెస్ బ్యాండ్ కలర్ స్క్రీన్  టచ్ డిస్‌ప్లేతో వస్తుంది. సులభంగా ఛార్జింగ్ చేయడానికి ఇంటిగ్రేటెడ్ యుఎస్‌బి ప్లగ్‌ కూడా ఉంది. రెడ్‌మి స్మార్ట్ బ్యాండ్ హార్ట్ బీట్ సెన్సార్, స్లీప్ క్వాలిటి  ట్రాకింగ్‌ ను చూపిస్తుంది.

అలాగే వివిధ రకాల కలర్ ఆప్షన్స్ తో వ్రిస్ట్ బ్యాండ్స్ కూడా ఉన్నాయి. షియోమి రెడ్‌మి స్మార్ట్ బ్యాండ్‌ను మొదట చైనాలో ఏప్రిల్‌ నెలలో ప్రారంభించింది.

భారతదేశంలో రెడ్‌మి స్మార్ట్ బ్యాండ్ ధర, వివరాలు
భారతదేశంలో రెడ్‌మి స్మార్ట్ బ్యాండ్ ధర రూ. 1,599. సెప్టెంబర్ 9 బుధవారం మధ్యాహ్నం 1 గంటలకు అమెజాన్, ఎం‌ఐ.కం, ఎం‌ఐ హోమ్ స్టోర్స్, ఆఫ్‌లైన్ రిటైలర్ల ద్వారా సేల్స్ ప్రారంభంకానుంది. బ్లాక్, బ్లూ, గ్రీన్, ఆరెంజ్ కలర్ ఆప్షన్లలో వ్రీస్ట్‌బ్యాండ్ లభిస్తుంది. షియోమి రెడ్‌మి స్మార్ట్ బ్యాండ్‌ను చైనాలో సిఎన్‌వై 99 (సుమారు రూ. 1,100) ధరతో ప్రారంభించింది.

రెడ్‌మి స్మార్ట్ బ్యాండ్ ఫీచర్స్ 
రెడ్‌మి స్మార్ట్ బ్యాండ్ 1.08-అంగుళాల కలర్ ఎల్‌సిడి ప్యానల్‌, 0.95-అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే కంటే పెద్దదిగా ఉంటుంది. రెడ్‌మి బ్యాండ్ ఆప్టికల్ సెన్సార్‌తో వస్తుంది, 24 గంటల పాటు హార్ట్ బీట్ సెన్సార్, ఐదు ప్రొఫెషనల్ స్పోర్ట్స్ మోడ్‌లు అలాగే స్లీప్ ట్రాకింగ్ సెన్సార్స్ కూడా ఉన్నాయి.

ఇంకా, బ్యాండ్‌లో క్యాలరీ, స్టెప్ ట్రాకర్, మీరు ఫిట్‌గా ఉండటానికి ఐడిల్ వార్నింగ్ కూడా ఇస్తుంది. ఎం‌ఐ బ్యాండ్ 4 లాగానే, రెడ్‌మి స్మార్ట్ బ్యాండ్ 5ఏ‌టి‌ఎం రేట్ వాటర్ -రేసిస్టంట్ తో వస్తుంది. 50 మీటర్ల లోతులో 10 నిమిషాలు ఉన్నగాని నీటిని నిరోధించగలదు.

స్విమ్మింగ్, స్నానం చేసేటప్పుడు కూడా ధరించవచ్చు. రెడ్‌మి స్మార్ట్ బ్యాండ్ ఒకే ఛార్జ్‌లో 14 రోజుల వరకు ఉంటుంది. ఇది హువావే బ్యాండ్ 4, హానర్ బ్యాండ్ 5i కి పోటీనిస్తుంది. ఆండ్రయిడ్ లేదా ఐ‌ఓ‌ఎస్ డివైజెస్ కి కనెక్ట్ చేసుకొవచ్చు, నోటిఫికేషన్‌లను కూడా చూపిస్తుంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios