Asianet News TeluguAsianet News Telugu

పేటీఎం మనీ యాప్ తో స్టాక్ మార్కెట్లో పెట్టుబడి.. ఎలా అనుకుంటున్నారా..

 పేటీఎం మనీ ఇండియాలోని అందరికీ స్టాక్ బ్రోకింగ్ సదుపాయాన్ని ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 10 లక్షలకు పైగా పెట్టుబడిదారులను చేర్చుకోవాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది, మొదటిసారి వినియోగదారులు ఎక్కువగా చిన్న నగరాలు, పట్టణాల నుండి ముందుకు వస్తున్నారు. 

paytm money app opens stock broking for all targeting 10 lakh investors this fiscal year
Author
Hyderabad, First Published Sep 29, 2020, 6:43 PM IST

దేశీయ ఫైనాన్షియల్ సర్వీసెస్  సంస్థ పేటీఎం యాజమాన్యంలోని అనుబంధ సంస్థ పేటీఎం మనీ ఇండియాలోని అందరికీ స్టాక్ బ్రోకింగ్ సదుపాయాన్ని ప్రారంభించినట్లు ప్రకటించింది.

ఈ ఆర్థిక సంవత్సరంలో 10 లక్షలకు పైగా పెట్టుబడిదారులను చేర్చుకోవాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది, మొదటిసారి వినియోగదారులు ఎక్కువగా చిన్న నగరాలు, పట్టణాల నుండి ముందుకు వస్తున్నారు.

పెట్టుబడిని ప్రోత్సహించడం, ఉత్పత్తిని సులభంగా ఉపయోగించడం, తక్కువ ధర (డెలివరీ ఆర్డర్‌లపై జీరో బ్రోకరేజ్, ఇంట్రాడేకు రూ .10), డిజిటల్ కెవైసితో ​​పేపర్‌లెస్ అకౌంట్ ఓపెనింగ్‌తో ఎక్కువ మందిని చేరుకోవడం మా ముఖ్య లక్ష్యం. 

ప్రారంభంలోనే ఇది 2.2 లక్షలకు పైగా పెట్టుబడిదారులను చేర్చిందని పేటీఎం మనీ పేర్కొంది. వీరిలో 65 శాతం మంది వినియోగదారులు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు గలవారు అని తెలిపింది.

also read గూగుల్ మీట్ షాకింగ్ న్యూస్.. సెప్టెంబర్ 30 నుంచి అమలు.. ...

ముంబై, బెంగళూరు, హైదరాబాద్, జైపూర్, అహ్మదాబాద్ నుండి ఎక్కువ మంది వినియోగదారులు ఉన్నారు. అంతే కాకుండా థానే, గుంటూరు, ఆగ్రా వంటి చిన్న పట్టణాల ప్రజలు పేటీఎం మని ద్వారా పెట్టుబడులు పెట్టారు.

పేటీఎం మనీ ఐ‌ఓ‌ఎస్, అండ్రాయిడ్, వెబ్ మూడు ప్లాట్‌ఫామ్‌లలో లభిస్తుంది. పేటీఎం మనీ యాప్ తో షేర్లపై పెట్టుబడులు పెట్టడం, వ్యాపారం చేయడం, ఎస్ఐ‌పిలను సెట్ చేయడానికి సులభమైన ఇంటర్‌ఫేస్‌ను అందిస్తుంది. పేటీఎం మనీలో ఇంటర్నల్ బ్రోకరేజ్ కాలిక్యులేటర్‌తో పెట్టుబడిదారులు లావాదేవీలను తెలుసుకోవచ్చు.

అలాగే లాభాల వాటాలను విక్రయించడానికి బ్రేక్-ఈవెన్ ధరను తెలుసుకోవచ్చు. అదనంగా స్టాక్ ట్రేడింగ్ అనుభవాన్ని మరింత మెరుగుపరచడానికి అధునాతన మ్యాప్స్, కవర్ చార్టులు వంటి ఇతర ఆప్షన్స్ కూడా జోడించారు.  

Follow Us:
Download App:
  • android
  • ios