కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు విధించిన లాక్ డౌన్ సమయంలో  వీడియో-కాన్ఫరెన్సింగ్ ప్లాట్‌ఫాంల వినియోగం మరింత పెరిగింది. జూమ్, గూగుల్ మీట్, జియో మీట్ యాప్స్ డౌన్ లోడ్లు, వినియోగం ఊపందుకున్నాయి.

టెక్ దిగ్గజం గూగుల్ వీడియో చాట్ ప్లాట్‌ఫాం గూగుల్ మీట్ సెప్టెంబర్ 30 తర్వాత గూగుల్ మీట్ యాప్ ఫ్రీ ప్లాన్ 60 నిమిషాల వరకు పరిమితం చేస్తూ ప్రకటించింది. గూగుల్ ప్రతినిధి  ఈమెయిల్‌లో మాట్లాడుతూ, " గూగుల్ మీట్ లేటెస్ట్ ఫీచర్స్ లో ఎలాంటి మార్పులు లేవు.

also read ఇన్‌స్టాగ్రామ్‌లాగానే లింక్డ్ఇన్ లో అదిరిపోయే లేటెస్ట్ ఫీచర్లు.. ...

ఒకవేళ అలాంటి మార్పులు ఉంటే  మేము మీకు తెలియజేస్తాము." అని అన్నారు. ప్రస్తుతం గూగుల్ అక్కౌంట్ ఉన్నవారు ఎవరైనా 100 మంది వరకు టైమ్ లిమిట్ లేకుండా ఫ్రీ మీటింగ్ క్రియేట్  చేయవచ్చు.

ఎడ్యుకేషన్ యూసర్ల కోసం జి సూట్, జి సూట్ లేటెస్ట్ ఫీచర్స్ అక్సెస్ కూడా సెప్టెంబర్ 30 గడువుతో ముగుస్తుంద్దని తరువాత వాటిని అక్సెస్ చేయలేరని తెలిపింది.

గూగుల్ మీట్ లో 250 మందితో  మీటింగ్స్, ఒకే డొమైన్‌లో 100,000 మంది వరకు లైవ్ స్త్రీమ్, మీటింగ్ రికార్డి చేసి గూగుల్  డ్రైవ్ లో సేవ్ చేసే ఫీచర్స్ ప్రస్తుతం అందిస్తుంది. ఆ ఫీచర్స్ సాధారణంగా జి‌ సూట్ "ఎంటర్ప్రైజ్" కస్టమర్లకు మాత్రమే లభిస్తాయి, దీని ధర నెలకు 25 (సుమారు రూ. 1,800)డాలర్లు.