Asianet News TeluguAsianet News Telugu

హైదరాబాద్‌లో ఇంటెల్‌ ఏఐ రిసెర్చ్‌ సెంటర్‌..

ఆల్‌.ఏఐ 2020 వర్చువల్‌ సమ్మిట్‌ అండ్‌ ఏఐ ఫర్‌ యూత్‌ సింపోజియం ప్రారంభోత్సవం సందర్భంగా ఏఐ రిసెర్చ్‌ సెంటర్‌కు ఇంటెల్‌ శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ పాల్గొన్నారు. 

Intel IIIT-Hyderabad PHFI Telangana govt launch AI Research Centre-sak
Author
Hyderabad, First Published Oct 13, 2020, 10:51 AM IST

న్యూ ఢీల్లీ: ఐఐటి-హైదరాబాద్, పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా (పిహెచ్‌ఎఫ్‌ఐ) తెలంగాణ ప్రభుత్వంతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు టెక్ దిగ్గజం ఇంటెల్ సోమవారం తెలిపింది. 

ఆల్‌.ఏఐ 2020 వర్చువల్‌ సమ్మిట్‌ అండ్‌ ఏఐ ఫర్‌ యూత్‌ సింపోజియం ప్రారంభోత్సవం సందర్భంగా ఏఐ రిసెర్చ్‌ సెంటర్‌కు ఇంటెల్‌ శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ పాల్గొన్నారు.

హెల్త్‌కేర్‌, స్మార్ట్‌ మొబిలిటి, నైపుణ్యం వంటి కీలక రంగాల్లో ఎదురవుతున్న సవాళ్ల పరిష్కారాలపై ఈ సెంటర్‌ ప్రధానంగా దృష్టి పెట్టనుందని ఇంటెల్‌ వివరించింది.

also read భారత మార్కెట్ లోకి టెక్నో కామోన్ 64 మెగాపిక్సెల్ కెమెరా స్మార్ట్ ఫోన్... ...

ఈ క్రమంలో ఆరోగ్య సంరక్షణ, స్మార్ట్‌ మొబిలిటి, భవిష్యత్తులో పని పరిణామక్రమం వంటి కీలక రంగాలు, అంశాల్లో దేశం ఎదుర్కొంటున్న సామాజిక సవాళ్లను పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉన్నది’ అని ఇంటెల్‌ కార్పొరేషన్‌ దేశీయ అధిపతి, ఇంటెల్‌ ఇండియా డేటా ప్లాట్‌ఫామ్స్‌ గ్రూప్‌ ఉపాధ్యక్షురాలు నివృతి రాయ్‌ అన్నారు.

పరిశ్రమ, అధ్యాపక, ప్రభుత్వ సహకారంతో ఐపీ జనరేషన్‌ ద్వారా అడ్వాన్స్‌ ఏఐ, సాంకేతిక అభివృద్ధి, ఉపాధి కల్పనపై దృష్టి పెడుతామన్నారు. కొత్తదనం, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌, జాతీయ ఆస్తుల సృష్టి, క్యూరేటెడ్‌ డేటాసెట్స్‌, కంప్యూటింగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లతో అంతర్జాతీయంగా ప్రతిభావంతులను ఆకర్షించేందుకు కృషి చేస్తామన్నారు.

సోమవారం నుంచి శుక్రవారం వరకు ఈ సదస్సు జరుగుతుంది. యువతకు ఏఐ నైపుణ్యంపైనా ఈ సదస్సులో చర్చిస్తారు.

Follow Us:
Download App:
  • android
  • ios