స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ ఒప్పో సరికొత్త  ఒప్పో ఎఫ్ 17 ప్రో దీపావళి ఎడిషన్‌ను భారతీయ మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ స్పెషల్ ఎడిషన్ స్మార్ట్ ఫోన్ గోల్డ్ కలర్ రంగులో ప్రవేశపెట్టారు. ఈ ఒప్పో మొబైల్ ఫోన్ బాక్స్‌లో 10000 mAh పవర్ బ్యాంక్ (18 W), దీపావళి ఎక్స్‌క్లూజివ్ బ్యాక్ కేస్ కవర్ కూడా అందిస్తుంది.

ఒప్పో ఎఫ్17ప్రో స్పెసిఫికేషన్స్:  సాఫ్ట్‌వేర్, డిస్‌ప్లే గురించి చెప్పాలంటే ఈ ఒప్పో స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 10 కలర్‌ ఓఎస్ 7.2తో పనిచేస్తుంది. ఈ డ్యూయల్ నానో సిమ్ ఫోన్‌ 6.43 అంగుళాల పూర్తి-హెచ్‌డి ప్లస్ (1,080 × 2,400 పిక్సెల్స్) సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేతో వస్తుంది.

ప్రాసెసర్, ర్యామ్ అండ్ స్టోరేజ్: ఫోన్‌లో మీడియాటెక్ హెలియో పి95 ఆక్టా-కోర్ ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్, స్పీడ్ ఇంకా మల్టీ టాస్కింగ్ కోసం 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రో ఎస్‌డి కార్డ్ సహాయంతో 1టి‌బి వరకు స్టోరేజ్ పెంచుకునే అవకాశం ఉంది.

బ్యాటరీ సామర్థ్యం: ఈ ఒప్పో స్మార్ట్‌ఫోన్‌లో 4000 mAh బ్యాటరీని అందిచారు, 30 వాట్ల ఫ్లాష్ ఛార్జ్ 4.0 ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: ఫోన్‌లో 4జి వివోల్‌టిఇ, వై-ఫై, బ్లూటూత్, జిపిఎస్, ఎ-జిపిఎస్, యుఎస్‌బి టైప్-సి పోర్ట్, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి. ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ అందించారు.

also read మొబైల్ డాటా త్వరగా అయిపోతుందా.. అయితే రిలయన్స్ జియో సూపర్ డాటా ప్లాన్స్ మీకోసమే.. ...

కెమెరా: క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ను ఫోన్ వెనుక ప్యానెల్‌లో ఇచ్చారు, ప్రాధమిక కెమెరా 48 మెగాపిక్సెల్స్, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్‌ కెమెరా ఉంది. 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ కెమెరా సెన్సార్, 2 మెగాపిక్సెల్ పోర్ట్రెయిట్ కెమెరా సెన్సార్ ఉన్నాయి.

సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం రెండు ఫ్రంట్ కెమెరా సెన్సార్లు, ఒకటి 16 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, మరొకటి 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా సెన్సార్ అందించారు.

భారతదేశంలో ఒప్పో ఎఫ్17ప్రో దీపావళి ఎడిషన్ ధర
ఒప్పో ఎఫ్ 17 ప్రో దీపావళి ఎడిషన్ 8 జిబి ర్యామ్ / 128 జిబి స్టోరేజ్ వేరియంట్ ధర 23,990 రూపాయలు. కొత్త ఒప్పో ఎఫ్ 17 ప్రో దీపావళి ఎడిషన్ మాట్టే గోల్డ్ ఆప్షన్‌లో వస్తుంది. ఇందులో బ్లూ అండ్ గోల్డ్ గ్రేడియంట్ ఫినిషింగ్ వేరియంట్ కూడా లభిస్తుంది.

ఈ ఒప్పో ఫోన్ ఇ-కామర్స్ సైట్ అమెజాన్‌లో ప్రీ-ఆర్డర్ బుకింగ్ కోసం అందుబాటులో ఉంది, అయితే సేల్స్ అక్టోబర్ 23 నుండి ప్రారంభమవుతుంది. ఈ‌ఎం‌ఐ సౌకర్యంతో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కార్డుతో 10 శాతం ఇన్స్టంట్ తగ్గింపు లభిస్తుంది. అమెజాన్ ప్రైమ్ సభ్యుల కోసం ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో 5 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుండగా, ప్రైమ్ కాని సభ్యులకు 3 శాతం క్యాష్‌బ్యాక్ ఇస్తుంది.