మీ మొబైల్ డేటా సగం రోజులోనే అయిపోతుందా.. అధిక డేటాతో ప్లాన్ కోసం చూస్తున్నార అయితే ఈ వార్త మీకోసమే. రోజుకి మీకు 3 జిబి డేటా అందించే జియో ప్రీపెయిడ్ ప్లాన్‌ల గురించి, అలాగే వాటితో లభించే ప్రయోజనాలు, వాలిడిటీ సమాచారం గురించి మీకోసం..

రిలయన్స్ జియో 349 ప్లాన్ వివరాలు:  రిలయన్స్ జియోలో  350 లోపు లభించే ఒక గొప్ప ప్లాన్ ఇది. ఈ జియో ప్లాన్ ధర రూ.349. ఈ ప్లాన్‌తో ప్రీపెయిడ్ వినియోగదారులకు రోజుకు 3 జీబీ డేటాను అందిస్తారు. అలాగే మీకు 28 రోజుల వాలిడిటీ లభిస్తుంది, అంటే ఈ ప్లాన్‌లో మొత్తం 84జి‌బి డేటా అందిస్తుంది.

ఇది కాకుండా జియో నుండి జియో ఆన్ లిమిటెడ్ కాలింగ్, ఇతర నెట్‌వర్క్‌లకు  కాల్స్ చేయడానికి 1000 నిమిషాలు ఇస్తున్నారు. ఈ ప్లాన్‌తో మీకు ప్రతిరోజూ 100 ఎస్‌ఎంఎస్‌లు వస్తాయి. జియో సినిమాతో సహా ఇతర జియో యాప్స్ కి ఫ్రీ అక్సెస్ ఇస్తుంది.

జియో 401 ప్లాన్: 401 రూపాయల రిలయన్స్ జియో ప్రీపెయిడ్ ప్లాన్‌తో రోజూ 3 జీబీ డేటాతో పాటు 6 జీబీ అదనపు డేటా వస్తుంది. జియో నుండి జియో ఆన్ లిమిటెడ్ కాల్స్, ఇతర నెట్‌వర్క్‌లకు రోజుకు 1000 నిమిషాలు, 100 ఎస్‌ఎంఎస్‌లు చేసుకోవచ్చు.  

also read 44 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వివో వి20 కొత్త స్మార్ట్ ఫోన్.. ...

ఈ జియో ప్లాన్ గురించి ప్రత్యేకమైన విషయం ఏంటంటే 401 రూపాయల ఈ ప్లాన్‌తో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌కు 1 సంవత్సర ఫ్రీ సబ్ స్క్రిప్షన్  లభిస్తుంది.

ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజులు, అంటే ఈ ప్యాక్‌ ఎంచుకున్న  వినియోగదారులకు మొత్తం 90జి‌బి డేటాను పొందుతారు. మీరు జియో సినిమాతో సహా ఇతర జియో యాప్స్ కి ఉచిత అక్సెస్  పొందుతారు.

జియో 999 ప్లాన్ : రూ.999 జియో ప్రీపెయిడ్ ప్లాన్‌తో ప్రతిరోజూ 3 జీబీ డేటా లభిస్తుంది. ఈ ప్లాన్ వాలిడిటీ 84 రోజులు. అంటే ఈ ప్యాక్‌తో మొత్తం 252 జీబీ డేటా వస్తుంది.

జియో నుండి జియోకు అన్‌లిమిటెడ్ కాలింగ్, ఇతర నెట్‌వర్క్‌లకు కాల్ చేయడానికి 3000 నిమిషాలు ఇవ్వబడుతుంది. దీనితో పాటు రోజూ 100 ఎస్‌ఎంఎస్‌ల సౌకర్యం కూడా ఉంది. ఇతర ప్లాన్‌ల లాగానే జియో యాప్స్‌కు  ఉచిత అక్సెస్  లభిస్తుంది.