చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ వన్‌ప్లస్ తాజాగా దాని స్మార్ట్ ఫోన్స్ కోసం ఓ‌ఎస్ అప్ డేట్ జాబితాను విడుదల చేసింది, త్వరలో ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఆక్సిజన్‌ ఓఎస్ 11 అప్ డేట్ రానున్నట్లు తెలిపింది, కానీ అప్ డేట్ లాంచ్ తేదీ గురించి కంపెనీ ఎటువంటి సమాచారం ఇవ్వలేదు.

ఆక్సిజన్‌ ఓఎస్ 11 అప్‌డేట్ పొందే ఫోన్‌ల జాబితాలో వన్‌ప్లస్ నార్డ్, వన్‌ప్లస్ 7, వన్‌ప్లస్ 7టి సిరీస్ ఫోన్‌లను చేర్చినట్లు కంపెనీ తెలిపింది.  కొన్ని నివేదికల ప్రకారం, వన్‌ప్లస్ నార్డ్ ఈ వారంలో మొదటి ఓపెన్ బీటా బిల్డ్ ఆక్సిజన్ ఓఎస్ 11 అప్ డేట్ పొందుతుంది.

also read పిల్లల ఆన్‌లైన్ క్లాసెస్ కోసం కొత్త స్మార్ట్ ఫోన్ కొంటున్నారా.. 10వేలలోపు లభించే బెస్ట్ స్మార్ట్ ఫోన...

దీని తరువాత వన్‌ప్లస్ 7, 7టి సిరీస్‌లు వచ్చే వారంలో అప్ డేట్ పొందుతాయి. వన్‌ప్లస్ 7 సిరీస్‌ను 2019లో ప్రారంభించారు. వన్‌ప్లస్ సంస్థ తన ఫోరమ్‌లో కొత్త అప్ డేట్ గురించి సమాచారం ఇచ్చింది.

సాధారణంగా వన్‌ప్లస్‌  ఇన్స్టంట్ అప్ డేట్ ఇవ్వడంలో ప్రసిద్ది చెందింది, అయితే ఈసారి కంపెనీ అప్ డేట్ విడుదల చేయడంలో కాస్త ఆలస్యం చేసింది. ఆండ్రాయిడ్ 11 అప్‌డేట్ లిస్ట్ లో శామ్‌సంగ్ డివైజెస్ ను వన్‌ప్లస్‌ అధిగమించింది. వన్‌ప్లస్‌ 8 సిరీస్ గత ఏడాది అక్టోబర్లో ఆక్సిజన్ ఓఎస్ 11 అప్ డేట్ పొందింది. 

ఇప్పుడు 2021 ప్రారంభంలో కంపెనీ వన్‌ప్లస్ నార్డ్, వన్‌ప్లస్ 7, వన్‌ప్లస్ 7టి సిరీస్ కోసం ఆక్సిజన్ ఓఎస్ 11 అప్ డేట్ విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇటీవల వన్‌ప్లస్ 8టిని స్నాప్‌డ్రాగన్ 865 ప్రాసెసర్‌తో, 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్‌తో విడుదల చేసిన సంగతి తెలిసిందే. వన్‌ప్లస్ 8టి కంపెనీ నుండి లాంచ్ అయిన లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్.