యూసర్ల వ్యక్తిగత డేటా భద్రతకు చట్టసభ సభ్యులు భయపడుతున్నందున, యుఎస్ ఫెడరల్ ఉద్యోగులు బుధవారం యుఎస్ సెనేట్ కమిటీ ఆమోదించిన బిల్లు కింద ప్రభుత్వం జారీ చేసిన పరికరాల్లో చైనా యాజమాన్యంలోని మొబైల్ వీడియో యాప్ టిక్‌టాక్‌ను ఉపయోగించకుండా నిరోధించారు.

చైనాకు చెందిన టిక్ టాక్ యాప్ ని అమెరికాలో దాదాపు నిషేధించినట్టే. ఎందుకంటే ఫెడరల్ ఉద్యోగులు ఫోన్లు, ఇతర డివైజెస్ లో ఈ యాప్ ని వినియోగించకుండా బ్యాన్ చేసేందుకు ఉద్దేశించిన బిల్లును బుధవారం యుఎస్ సెనేట్ కమిటీ ఆమోదించింది.

also read మొబైల్ యూసర్ల కోసం నెట్‌ఫ్లిక్స్ సరికొత్త ప్లాన్.. తక్కువ ధరకే హెచ్‌డి కంటెంట్ ...

యూజర్ల పర్సనల్ డేటా చైనా చేతుల్లోకి వెళ్లిపోతుందన్న భయంతో దీనికి బ్యాన్ చేసేందుకు ఆమోదం చెప్పారు. ‘నో టిక్ టాక్ ఆన్ గవర్నమెంట్ డివైజెస్ యాక్ట్’ పేరిట జోష్ హాలే అనే సెనెటర్ ప్రవేశపెట్టిన బిల్లును ఈ కమిటీ ఏకగ్రీవంగా ఆమోదించింది.

దీనిపై యూఎస్  సెనేట్ లో దీనిపై ఓటింగ్ జరగనుంది. అమెరికాలో ముఖ్యంగా 16 నుంచి 24 ఏళ్ళ మధ్యవయసున్న యువత ఎక్కువగా టిక్ టాక్ ని ఉపయోగిస్తున్నారు. దేశ జనాభాలో 60 శాతం మంది యువత ఈ యాప్ ఉపయోగిస్తున్నారు.

ఫెడరల్ సిబ్బంది ఈ యాప్ వాడరాదని ఇటీవలే ప్రతినిధుల సభ బిల్లును ప్రవేశపెట్టగా 336 మంది అనుకూలంగాను, 71 మంది వ్యతిరేకంగాను ఓటు చేశారు. ప్రతినిధుల సభలోను, సెనేట్ లోను ఈ బిల్లులు ఆమోదం పొందడంతో త్వరలో దేశంలో చట్టంపరం కావచ్చు.