Asianet News TeluguAsianet News Telugu

మొబైల్ యూసర్ల కోసం నెట్‌ఫ్లిక్స్ సరికొత్త ప్లాన్.. తక్కువ ధరకే హెచ్‌డి కంటెంట్

రీడ్ హ్యాస్టింగ్స్ యాజమాన్యంలోని ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ఇండియన్ యూసర్ల కోసం మొబైల్ స్క్రీన్  స్టాండర్డ్ డెఫినిషన్ కంటెంట్‌ను అందించెందుకు నెలకు రూ.199 ప్లాన్ ప్రవేశపెట్టిన తరువాత ఈ కొత్త ప్లాన్ ప్రవేశపెట్టింది. "స్మార్ట్‌ఫోన్ వాడే ఎవరికైనా నెట్‌ఫ్లిక్స్ కంటెంట్ ను ఆనందించడానికి, మరింత సులభతరం చేయడానికి ఈ కొత్త మొబైల్ ప్లాన్‌ను భారతదేశంలో ప్రారంభించాము.

netflix introduces new low cost plan mobile users in india
Author
Hyderabad, First Published Jul 23, 2020, 12:28 PM IST

అమెరికన్ స్ట్రీమింగ్ సర్వీస్ నెట్‌ఫ్లిక్స్ భారతదేశం కోసం కొత్త ప్లాన్ అందిస్తోంది. దీని ధర నెలకు రూ. 349, మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌ల కోసం హై డెఫినిషన్ (హెచ్‌డి) కంటెంట్‌ను అందుబాటులోకి తెస్తుంది, కానీ టెలివిజన్ స్క్రీన్‌లకు కాదు.

రీడ్ హ్యాస్టింగ్స్ యాజమాన్యంలోని ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ఇండియన్ యూసర్ల కోసం మొబైల్ స్క్రీన్  స్టాండర్డ్ డెఫినిషన్ కంటెంట్‌ను అందించెందుకు నెలకు రూ.199 ప్లాన్ ప్రవేశపెట్టిన తరువాత ఈ కొత్త ప్లాన్ ప్రవేశపెట్టింది.

"స్మార్ట్‌ఫోన్ వాడే ఎవరికైనా నెట్‌ఫ్లిక్స్ కంటెంట్ ను ఆనందించడానికి, మరింత సులభతరం చేయడానికి ఈ కొత్త మొబైల్ ప్లాన్‌ను భారతదేశంలో ప్రారంభించాము. ఈ ఆఫర్ ను యూసర్లు ఇష్టపడుతున్నారా లేదా అని మేము చూడాలనుకుంటున్నాము.

also read అమెజాన్ ప్రైమ్ డే సేల్.. కొత్త బ్రాండ్లు కళ్ళు చెదిరే ఆఫర్లు.. ...

ఒకవేళ వారు ఈ కొత్త ప్లాన్ ని ఆనందిస్తే  మేము దాన్ని దీర్ఘకాలికంగా విడుదల చేస్తాము "అని కంపెనీ ఒక ప్రకటనలో ధృవీకరించింది. ఈ నెట్‌ఫ్లిక్స్ మొబైల్-ప్లాన్ ప్రపంచంలోనే మొదటిది, భారతదేశంలో నాల్గవది. దాని ప్రాథమిక రూ. 499, స్టాండర్డ్ రూ. 649, ప్రీమియం ప్లాన్‌లు రూ. 799 అదనంగా ఈ కొత్త ప్లాన్ ప్రవేశపెట్టింది.

గత వారం నెట్‌ఫ్లిక్స్ ఆసియా పసిఫిక్ ప్రాంతంలో 22.49 మిలియన్ పేమెంట్ మెంబర్ షిప్ లను ఉన్నట్లు నివేదించింది. ప్రపంచవ్యాప్తంగా రీడ్ హ్యాస్టింగ్స్ యాజమాన్యంలోని సర్వీస్  10.1 మిలియన్ పేమెంట్ మెంబర్ షిప్ లను అదనంగా చేర్చింది, దీని వల్ల క్యూ2 లో సంవత్సరానికి 25% ఆదాయాలు పెరిగాయి.

మీడియా నిపుణులు, పరిశోధన నివేదికల ప్రకారం భారతదేశం 5 మిలియన్ల మంది సబ్ స్క్రైబర్స్ ఉన్నట్లు తెలిపింది. మార్చి మధ్య నుండి భారతదేశంలో కరోనా వైరస్ మహమ్మారి భారీగా అంతరాయం కలిగించిందని నెట్‌ఫ్లిక్స్ ఇండియా కంటెంట్ వైస్ ప్రెసిడెంట్ మోనికా షెర్గిల్‌కు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios