త్వరలో నోకియా కొత్త ల్యాప్‌టాప్ లాంచ్.. 11 ఏళ్ళ తరువాత మళ్లీ మార్కెట్లోకి..

నోకియా ప్యూర్‌బుక్ ఎక్స్ 14 అనేది ప్యూర్‌బుక్ సిరీస్‌లో మొట్టమొదటి నోకియా ల్యాప్‌టాప్‌గా వస్తునట్లు తెలిపింది.ఆన్‌లైన్ మార్కెట్లో కొత్త నోకియా ల్యాప్‌టాప్‌ ఫోటో, కొన్ని స్పెసిఫికేషన్‌లను నోకియా టీజ్ చేసింది. 

Nokia PureBook X14 Laptop With Intel Core i5 Processor Teased on Flipkart: check full Specifications

నోకియా ప్యూర్‌బుక్ ఎక్స్ 14 త్వరలో భారతదేశంలో విడుదల కానున్నట్లు ఫ్లిప్‌కార్ట్‌లో అప్‌డేట్ చేసిన మైక్రోసైట్ ద్వారా తెలుస్తుంది. నోకియా ప్యూర్‌బుక్ ఎక్స్ 14 అనేది ప్యూర్‌బుక్ సిరీస్‌లో మొట్టమొదటి నోకియా ల్యాప్‌టాప్‌గా వస్తునట్లు తెలిపింది.

ఆన్‌లైన్ మార్కెట్లో కొత్త నోకియా ల్యాప్‌టాప్‌ ఫోటో, కొన్ని స్పెసిఫికేషన్‌లను నోకియా టీజ్ చేసింది. నోకియా ప్యూర్‌బుక్ సిరీస్‌ను భారత్‌లో లాంచ్ చేయనున్నట్లు గత వారం ఫ్లిప్‌కార్ట్ మైక్రోసైట్లో ప్రదర్శించింది. ఒక వెబ్‌సైట్‌లోని జాబితా ప్రకారం త్వరలో ఇండియాలో మరిన్ని నోకియా ల్యాప్‌టాప్‌లను తీసురురానున్నట్లు కూడా సూచించింది.

ఫ్లిప్‌కార్ట్‌లో అప్ డేట్ చేసిన మైక్రోసైట్ నోకియా ప్యూర్‌బుక్ ఎక్స్ 14 ఫోటోని ప్రదర్శించింది, దీని బట్టి ల్యాప్‌టాప్ బ్లాక్ కలర్ ఆప్షన్‌లో, నోట్ బుక్ సైజ్ లో, చిక్లెట్-స్టయిల్ కీబోర్డ్, మల్టీ-టచ్ తో పెద్ద టచ్ ప్యాడ్ ఉన్నట్లు తేలుస్తుంది.

also read 4జి డివైజెస్ మరింత చౌకగా అందించేందుకు రియల్‌మీతో రిలయన్స్ జియో చేతులు.. ...

నోకియా ప్యూర్‌బుక్ ఎక్స్ 14 ఫీచర్లు..
నోకియా ప్యూర్‌బుక్ ఎక్స్ 14 సింగిల్ వేరియంట్‌తో ఇంటెల్ కోర్ ఐ5 ప్రాసెసర్ ద్వారా వస్తున్నట్లు ఫ్లిప్‌కార్ట్‌ మైక్రోసైట్  చూపిస్తుంది. డాల్బీ అట్మోస్‌తో పాటు డాల్బీ విజన్ టెక్నాలజీ, 1.1 కిలోగ్రాముల బరువుతో యుఎస్‌బి 3.0, హెచ్‌డిఎంఐ పోర్ట్‌లు కూడా ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. నోకియా ప్యూర్‌బుక్ ఎక్స్‌14 లభ్యతపై ఫ్లిప్‌కార్ట్ ఇంకా ఎలాంటి వివరాలు వెల్లడించలేదు.  

నోకియా ప్యూర్‌బుక్ ఎక్స్ 14 లాంచ్, భారతదేశంలో దీని ధర గురించి పూర్తి వివరాలు అధికారికంగా ఇంకా వెల్లడి కాలేదు. నోకియా బ్రాండింగ్‌తో కూడిన తొమ్మిది ల్యాప్‌టాప్ మోడళ్లు ఇటీవల ఒక సైట్‌లో కనిపించాయి. ఈ మోడళ్లలో ఐదు ఇంటెల్ కోర్ ఐ5 ప్రాసెసర్‌లతో, నాలుగు ఇంటెల్ కోర్ ఐ3 చిప్‌తో రానున్నాయి. ఇవి ఇంటెల్ 10వ జనరేషన్ ప్రాసెసర్లు అయ్యే అవకాశం ఉంది.

కొత్త ల్యాప్‌టాప్‌లు నోకియా బ్రాండింగ్‌తో థర్డ్ పార్టీ చేత తయారుచేసినట్లు సమాచారం. అవి మూడవ పక్షం చేత తయారు చేయబడే అవకాశం ఉంది మరియు ఫ్లిప్‌కార్ట్‌కు ప్రత్యేకమైనవి. ఆన్‌లైన్ మార్కెట్ ఇప్పటికే నోకియా-బ్రాండెడ్ స్మార్ట్ టీవీలను ఇండియాలో విక్రయిస్తుంది.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios