కరోనా వైరస్ వల్ల ప్రపంచ దేశాలు లాక్ డౌన్ అమలు  చేశాయి. ప్రజలు, ఉద్యోగులు ఇళ్లకే పరిమితమయ్యారు. వ్యాపారాలు మూతపడ్డాయి. దీంతో ప్రజలు ఇంట్లో ఉంటూ ఇంటర్నెట్ వినియోగంతో కాలక్షేపం చేస్తున్నారు. అయితే ఇలాంటి సమయంలో ఆన్ లైన మూవీ యాప్స్ ప్రజలను ఆకర్శించేందుకు వివిధ ఆఫర్లాను ప్రవేశపెట్టింది.

ఇంట్లో ఉంటూనే స్మార్ట్ ఫోన్ లో ఇంటర్నెట్ ద్వారా నెట్‌ఫ్లిక్స్  సైట్ ‌అత్యుత్తమ ప్రమాణాలతో సేవలను అందిస్తుంది. మూవీస్, ఇతర కంటెంట్ అందిస్తునాయి. తాజాగా ఆన్ లైన స్ట్రెమింగ్  యాప్  నెట్‌ఫ్లిక్స్ కీలక ప్రకటన చేసింది. నెట్‌ఫ్లిక్స్ సైట్‌ను నెల లేదా 12 నెలల కాలానికి రీచార్జ్‌ చేసుకున్నా వినియోగదారులకు నెట్ ఫ్లిక్స్ వాలిడిటీ అయిపోయాక వినియోగదారులు తీరిగి రిచార్జ్ పై  చేయని వారి పట్ల సంస్థ ఆవేదన వ్యక్తం చేసింది.

also read లేటెస్ట్ ఫీచర్స్, 5జి సపోర్ట్ తో ఒప్పో నుండి ఎక్స్ సిరీస్ స్మార్ట్ ఫోన్లు...

వ్యాలిడిటీ అయిపోయాగానే వినియోగదారులు స్పందించడం లేదని సంస్థ ఆవేదన వ్యక్తం చేసింది. అధిక సంఖ్యలో వినియోగదారులు రీచార్జ్‌ చేయడం లేదని.. సైట్‌ను రీచార్జ్‌ చేయని వినియోగదారులు స్పందించకుంటే కనెక్షన్లను తీసివేస్తామని సంస్థ ప్రతినిథి యెడ్డీ వూ హెచ్చరించ్చారు.

నెట్‌ఫ్లిక్స్ సభ్యులు తామ సభ్యత్వాన్ని పొందాలనుకుంటున్నట్లు తేలపకపోతే, అది ఆటోమేటిక్ గా  వారి సభ్యత్వాన్ని రద్దు చేస్తుందని కంపెనీ తెలిపింది. ఇటువంటి రిచార్జ్ చేయని ఖాతాలు మొత్తం ఉన్న ఆకౌంట్లలో 0.5% కన్నా తక్కువ ఉన్నాయని ఇది కొన్ని లక్షల ఆకౌంట్లు మాత్రమే అని  నెట్‌ఫ్లిక్స్ డైరెక్టర్ ఎడ్డీ వు గురువారం ఒక బ్లాగ్ పోస్ట్‌లో రాశారు.

నెట్‌ఫ్లిక్స్ ఇన్ ఆక్టివ్ ఖాతాలను తిసేసిన తర్వాత, ఫేవరేట్స్, ప్రొఫైల్‌లు, వ్యూ ప్రిఫరెన్స్, అక్కౌంట్ వివరాలను 10 నెలలు ఉంచుతుంది, కాబట్టి ఎవరైనా మళ్లీ సైన్ అప్ చేయాలని నిర్ణయించుకుంటే వారు తమ ఖాతాలను తిరిగి పొందవచ్చు. 2020 మొదటి త్రైమాసికంలో నెట్‌ఫ్లిక్స్ రికార్డు స్థాయిలో 15.8 మిలియన్ల సబ్ స్క్రాబర్స్ ను  సంపాదించింది.