లేటెస్ట్ ఫీచర్స్, 5జి సపోర్ట్ తో ఒప్పో నుండి ఎక్స్ సిరీస్ స్మార్ట్ ఫోన్లు...
ఒప్పో ఫైండ్ ఎక్స్ 2 నియో 12 జిబి ర్యామ్ మోడల్ ధర యూరో 699 (సుమారు రూ. 58,000) ధరగా నిర్ణయించింది. ఫోన్ 5జి సపోర్ట్ తో, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగిన కర్వ్ డిస్ ప్లేతో వస్తుంది ఇందులో మల్టీ లేయర్ కూలింగ్ సిస్టం కూడా ఉంది.
చైనా స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఒప్పో తాజాగా ఫైండ్ ఎక్స్ 2 నియో స్మార్ట్ ఫోన్ పై కొన్ని నెలలుగా వస్తున్న పుకార్ల తర్వాత ఇప్పుడు అధికారికంగా సేల్స్ ప్రారంభమయ్యాయి.ఫోన్ 5జి సపోర్ట్ తో, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగిన కర్వ్ డిస్ ప్లేతో వస్తుంది ఇందులో మల్టీ లేయర్ కూలింగ్ సిస్టం కూడా ఉంది.
కొత్త ఒప్పో స్మార్ట్‌ఫోన్ ఫైండ్ ఎక్స్ 2 సిరీస్‌లో అదనంగా ఒప్పో ఫైండ్ ఎక్స్ 2, ఒప్పో ఫైండ్ ఎక్స్ 2 ప్రో, ఒప్పో ఫైండ్ ఎక్స్ 2 లైట్ కూడా ఉన్నాయి.ఒప్పో ఫైండ్ ఎక్స్ 2, ఫైండ్ ఎక్స్ 2 ప్రో మార్చిలో ప్రారంభించారు. ఫైండ్ ఎక్స్ 2 లైట్ ఏప్రిల్‌లో ఆవిష్కరించినప్పటికీ, లైనప్‌లోని నాల్గవ మోడల్ ఇప్పుడు రిలీజ్ చేశారు.
ఒప్పో ఫైండ్ ఎక్స్ 2 నియో ధర ప్రస్తుతం జర్మనీలో యూరో 699 (సుమారు రూ. 58,000) వద్ద కొనుగోలుకు అందుబాటులో ఉంది. స్టార్రి బ్లూ, మూన్‌లైట్ బ్లాక్ అనే రెండు కలర్ ఆప్షన్స్ లో మీకు లభిస్తుంది.
దీని అధికారిక లాంచ్ తేదీని మాత్రం ఒప్పో ప్రకటించలేదు. కంపెనీ లాంచ్ తేదీ లేదా ఫోన్‌ల గురించి ఎలాంటి విషయం ప్రస్తావించలేదు కాని ఫోన్‌లు త్వరలో వస్తాయి అని చెప్పింది.
ఒప్పో ఫైండ్ ఎక్స్ 2 సింగిల్ సిమ్ స్మార్ట్‌ఫోన్, 6.5-అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే 2,400 x 1,080 రిజల్యూషన్, 402 పిపి పిక్సెల్ డెన్సిటీని కలిగి ఉంది.
also read అమెజాన్ ఇండియాలో కొత్తగా 50వేల ఉద్యోగాలు... ...
ఒప్పో ఫోన్ ఆండ్రాయిడ్ 10-బేస్డ్ కలర్ ఓఎస్ 7తో నడుస్తుంది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 765 జి సోసి, ఇంటిగ్రేటెడ్ అడ్రినో 620 జిపియుతో పనిచేస్తుంది. మీరు ఫోన్‌లో 12 జీబీ ర్యామ్‌తో పాటు 256 జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్ స్పేస్ పొందుతారు.
ఫోటోలు, వీడియోల కోసం ఒప్పో ఫైండ్ ఎక్స్ 2 నియోలో క్వాడ్ రియర్ కెమెరాలు ఉన్నాయి. ఎఫ్ / 1.7 ఎపర్చర్‌తో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, ఎఫ్ / 2.4 ఎపర్చర్‌తో 13 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా, ఎఫ్ / 2.2 ఎపర్చర్‌తో 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ షూటర్, ఎఫ్ / 2.4 తో 2 మెగాపిక్సెల్ షూటర్ ఉన్నాయి.
ముందు వైపు, ఎఫ్ / 2.4 ఎపర్చర్‌తో 32 మెగాపిక్సెల్ స్నాపర్, కెమెరాలో 20 ఎక్స్ డిజిటల్ జూమ్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్, ప్రొఫెషనల్, పనోరమా, పోర్ట్రెయిట్, నైట్, టైమ్ లాప్స్ ఫోటోగ్రఫీ, స్లో మోషన్ వంటి అనేక కెమెరా మోడ్‌లు ఉన్నాయి.
అదనంగా మీరు వెనుక కెమెరా ఉపయోగించి సెకనుకు 30 ఫ్రేమ్‌ల వద్ద 4 కె వీడియోలను షూట్ చేయవచ్చు, ముందు భాగంలో మీరు పూర్తి హెచ్‌డి వీడియోలను సెకనుకు 30 ఫ్రేమ్‌ల వద్ద రికార్డ్ చేయవచ్చు.
వూక్ ఫ్లాష్ ఛార్జ్ 4.0 కు సపోర్ట్ తో ఒప్పో ఫైండ్ ఎక్స్2 నియో 4,025mAh బ్యాటరీని ఇందులో అమర్చారు. ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. కనెక్టివిటీలో 5జి, బ్లూటూత్ 5.1, వై-ఫై, ఎన్‌ఎఫ్‌సి, జిపిఎస్‌లకు సపోర్ట్ ఇస్తుంది. ఆన్ బోర్డ్ సెన్సార్లలో కాంపస్, యాంబియంట్ లైట్ సెన్సార్, ప్రాక్సీమిటి సెన్సార్, యాక్సిలెరోమీటర్, గైరోస్కోప్ ఉన్నాయి.