ప్రముఖ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ లెనోవా యజమాన్యంలోని మోటరోలా రూపొందించిన మోటో జి8 పవర్ లైట్ భారత్‌లోకి అడుగుపెట్టింది. ఈ కొత్త స్మార్ట్ ఫోన్ ఈ నెలాఖరులోగా అమ్మకాలకు ప్రారంభించనుంది.

ఈ ఫోన్‌ను ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్‌లో ఆవిష్కరించారు. మోటో జి8 పవర్ లైట్ ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో పి35 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. దీనికి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌, 4జి‌బి ర్యామ్, 64జి‌బి స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లో మాత్రమే లభించనుంది. కాని ఇది రెండు కలర్ వేరియంట్‌ ఆప్షన్స్ లో లభ్యమవుతుంది. ఇందులో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది.

మోటో జి8 పవర్ లైట్ సింగిల్ స్టోరేజ్ వేరియంట్ 4 జిబి ర్యామ్, 64 జిబి ఆన్బోర్డ్ స్టోరేజ్ తో మాత్రమే అందించనున్నారు. మోటరోలా ప్రకారం, ఈ ఫోన్  ప్రస్తుత ధర రూ. 8,999, ఫ్లిప్‌కార్ట్ ద్వారా మే 29 నుండి మధ్యాహ్నం 12 గంటలకు అమ్మకాలు ప్రారంభమవుతాయి. ఇది ఆర్కిటిక్ బ్లూ, రాయల్ బ్లూ కలర్ ఆప్షన్లలో వస్తుంది.

మోటో జి8 పవర్ లైట్ స్మార్ట్ ఫోన్ కొనడానికి ఆసక్తి ఉన్న కస్టమర్ల కోసం ఫ్లిప్‌కార్ట్ కొన్ని ఆఫర్లను అందించనుంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా చేసే కొనుగోళ్లపై వినియోగదారులు 5 శాతం ఆన్ లిమిటెడ్ క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. అంతే కాదు అనేక ఈ‌ఎం‌ఐ ఆప్షన్స్ కూడా ఉన్నాయి.

also read స్విగ్గి, జొమాటోలకు సవాల్.. ఫుడ్ డెలివరీలోకి ‘అమెజాన్’ ...

మోటో జి8 పవర్ లైట్ ఆండ్రాయిడ్ పై ఓఎస్ మోటరోలా స్టాక్ స్కిన్‌తో నడుస్తుంది. ఇది 6.5-అంగుళాల హెచ్‌డి + (720x1,600 పిక్సెల్స్) ఐపిఎస్ ఎల్‌సిడి డిస్‌ప్లే, 269 పిపి పిక్సెల్ కలిగి ఉంది. మోటో జి8 పవర్ లైట్ మీడియాటెక్ హెలియో పి35 సోసితో పాటు 4 జిబి ర్యామ్‌తో పనిచేస్తుంది.

మోటో జి8 పవర్ లైట్ వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్‌ ఉంది, ఇది 16 మెగాపిక్సెల్ షూటర్ ద్వారా ఎఫ్ / 2.0 ఎపర్చర్‌తో పాటు 2 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ ఎఫ్ / 2.4 మాక్రో లెన్స్, 2- మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా ఉంది. ముందు వైపున, ఎఫ్ / 2.0 ఎపర్చర్‌తో 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. మోటో జి8 పవర్ లైట్ 64 జిబి ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో వస్తుంది, ఇది మైక్రో ఎస్‌డి కార్డ్ (256 జిబి వరకు) ద్వారా మరింత పెంచుకోవచ్చు.

దీనికి 10W ఛార్జింగ్ సపోర్టుతో 5,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. కనెక్టివిటీ ఆప్షన్స్ లో 4జి ఎల్‌టిఇ, బ్లూటూత్ వి4.2, వై-ఫై 802.11 బి / జి / ఎన్, జిపిఎస్ / ఎ-జిపిఎస్, మైక్రో-యుఎస్‌బి పోర్ట్, 3.5 ఎంఎం ఆడియో జాక్ ఉన్నాయి. మోటో జి8 పవర్ లైట్ వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఉంది. ఇది 200 గ్రాముల బరువు ఉంటుంది.