న్యూఢిల్లీ: కాదేదీ కవితకు అనర్హం అని ఓ మహా కవి అన్నారు.. ఇప్పుడు చెల్లింపుల విధానానికేదీ అనర్హం కాదు.. ఒకప్పుడు జేబులో పర్సు, పర్సులో డబ్బులు లేకుండా ఏ చెల్లింపులు జరిగేయి కాదు. 

అయితే ఎటువంటి చెల్లింపులైన జరిపేందుకు 2011లో ‘మాస్టర్‌ కార్డు’ అందుబాటులోకి రావడంతో బ్యాంకింగ్‌ లావా దేవీల్లో అది ఓ పెద్ద విప్లవంగా పేర్కొన్నారు. అప్పట్లో ఆ కార్డు కేవలం వీఐపీలకే అందుబాటులో ఉండేది. 

 also read ఫేస్ బుక్, వాట్సాప్ లకు ధీటుగా సొంతంగా సోషల్ మీడియా...

2014లో బార్‌క్లే కార్డు అందుబాటులోకి వచ్చింది. ఆ తర్వాత ఏడాదికి స్మార్ట్‌ ఫోన్‌ను ఉపయోగించి ‘ఆపిల్‌ పే’ విధానం అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు బ్యాంక్‌ క్రెడిట్, డెబిట్‌ కార్డులతోపాటు పేటీఎం, రూపే, గూగుల్‌ పే ఎన్నో డబ్బు చెల్లింపు యాప్‌లు అందుబాటులోకి వచ్చాయి. 

సరికొత్తగా చొక్కా చివరన గుండీలాగా అమర్చుకునే చిప్, వేలికి ధరించే ఉంగరం, కంకణం వంటి పరికరాలతో చెల్లింపుల సౌకర్యం అందుబాటులోకి వచ్చాయి. చెల్లింపు మిషన్‌ వద్దకు ఈ చిప్, ఉంగరం లేదా కంకణం తీసుకెళ్లి కావాల్సినంత చెల్లింపులు జరపవచ్చు. అయితే, క్రెడిట్‌ కార్డుల్లాగా ఇవి పని చేయవు. ఖాతాలో డబ్బులు ఉన్నప్పుడే పని చేస్తాయి. పైగా ఇవన్నీ యాప్‌లకు అనుసంధానించి పని చేస్తాయి. 

also read ఒప్పో నుంచి కొత్త యాప్...10 లక్షల వరకు పర్సనల్‌ లోన్‌ పొందవచ్చు...

చేతికి ధరించిన కంకణం ద్వారా చెల్లింపులు జరపాలంటే బార్ క్లే తెచ్చిన ‘పింగిట్‌’ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సిందే. అలాగే పనిచేసే ‘కే’ ఉంగరం నలుపు, తెలుపు రంగుల్లో లభిస్తోంది. మూడింటిలో ఇదే ఖరీదైనది. దాదాపు రూ.9000కు ఈ ఉంగరం, దాని సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. 

మిగతా సేవలు రూ.2500 నుంచి అందుబాటులో ఉన్నాయి. ఈ వస్తువులు పోయినప్పుడు లేదా చోరీ అయినప్పుడు చెల్లింపులను యాప్‌ ద్వారా నిలిపివేయవచ్చు. 2024 నాటికి ఇలాంటి చెల్లింపు పద్ధతులు 18 లక్షల వరకు రావచ్చన్నది ఓ అంచనా. అప్పుడు జేబులో పెన్ను, మెడలో గొలుసు, చెవి పోగులు, ముక్కు పుడక ఏ ఆభరణం రూపంలోనైనా చెల్లింపులు జరుపవచ్చు.