దేశీయ టెలికాం దిగ్గజం మరో ఘనత సాధించింది. ఈ సంవత్సరంలో ప్రపంచంలోని అత్యంత స్ట్రాంగ్ బ్రాండ్ గా అవతరించి, టాప్ 5 ర్యాంకింగ్  లో చోటు సాధించింది.  బి‌ఎస్‌ఐ లో జియో 100కి 91.7 స్కోరుతో AAA+ బ్రాండ్ స్ట్రెంత్ రేటింగ్ పొందింది.

రిలయన్స్ 2016లో  స్థాపించినప్పటికీ అతితక్కువ సమయంలోనే దేశంలోని అతిపెద్ద మొబైల్ నెట్‌వర్క్‌గా అవతరించింది. అలాగే  400 మంది మిలియన్ యూసర్లతో ప్రపంచంలో మూడవ అతిపెద్ద మొబైల్ నెట్‌వర్క్ ఆపరేటర్ గా మారింది.

చాలా సరసమైన రిచార్జ్  ప్లాన్లకు పేరుగాంచిన రిలయన్స్ జియో 4జి నెట్వర్క్ ఆఫర్ చేయడంలో  భారతదేశంలో  సంచలనం సృష్టించింది.మిలియన్ల మంది భారతీయు వినియోగదారులకు ఉచితంగా 4జి  ఇంటర్నెట్‌ను కూడా అందించింది.

also read టిక్‌టాక్ తో సహ అన్నీ చైనా యాప్‌లకు మరో భారీ షాక్‌! ఇక ఎప్పటికీ ఇండియాలోకి రాలేవు.. ...

బ్రాండ్ ఫైనాన్స్  ఒరిజినల్ మార్కెట్ పరిశోధన ఫలితాల నుండి దేశవ్యాప్తంగా జియో బ్రాండ్  ఆధిపత్యం స్పష్టంగా తెలుస్తుంది.

దేశవ్యాప్తంగా  జియో బ్రాండ్  ఆధిపత్యం ఇతర టెలికాం పోటీదారులతో పోలిస్తే పరిశీలన మార్పిడి, రెప్యుటేషన్, రికమెండేషన్, ఆవిష్కరణ, కస్టమర్ సర్వీస్, వాల్యు ఫర్ మని   అన్ని కొలమానాల్లో జియో స్కోర్లు అత్యధికం.

జియో  బ్రాండ్‌కు ఈ రంగంలో పెద్ద బలహీనతలు లేవు అలాగే ఇతర టెలికాం పోటీదారుల కంటే భిన్నంగా ఉంటుంది. బ్రాండ్ ఫైనాన్స్ అనేది ప్రపంచంలోనే ప్రముఖ బ్రాండ్ వాల్యుయేషన్ కన్సల్టెన్సీ.