Asianet News TeluguAsianet News Telugu

జియో కస్టమర్లకు షాక్.. ఆ 4 ప్రీపెయిడ్ ప్లాన్ల తొలగింపు..

జియో కొత్త కొత్త ప్లాన్లతో వినియోగదారులను ఆకర్షిస్తుంటుంది. కానీ కొత్త సంవత్సరంలో  వినియోగదారులకు  ప్రీ-పెయిడ్ ప్లాన్లలోని కొన్నిటిని మూసివేస్తు పెద్ద షాక్ ఇచ్చింది. 

jio phone recharge plans priced at rs 99 rs 153 rs 297 and rs 594 plan removed  check new update here
Author
Hyderabad, First Published Jan 16, 2021, 5:07 PM IST

దేశీయ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో కొత్త కొత్త ప్లాన్లతో వినియోగదారులను ఆకర్షిస్తుంటుంది. కానీ కొత్త సంవత్సరంలో  వినియోగదారులకు  ప్రీ-పెయిడ్ ప్లాన్లలోని కొన్నిటిని మూసివేస్తు పెద్ద షాక్ ఇచ్చింది. రిలయన్స్ జియో ఈ ఆకస్మిక నిర్ణయం వల్ల 60 మిలియన్లకు పైగా కస్టమర్ల పై  ప్రభావం చూపనుంది. 

జియో ఫోన్ కోసం రూపొందించిన రూ.153 ప్లాన్ ఇకపై జియో వెబ్‌సైట్, మై జియో యాప్‌లో కనిపించదు. జియో ఫోన్ రూ.153 ప్లాన్‌లో రోజూ 1.5 జీబీ డేటా, 28 రోజులు వాలిడిటీ అందించింది.

జియో ఫోన్ కోసం ఈ రూ.153 ప్రణాళికను జూలై 2017లో ప్రారంభించారు. ఈ ప్లాన్ ప్రకారం జియో నుండి అన్ని ఇతర నెట్‌వర్క్‌లకు ఆన్ లిమిటెడ్ కాలింగ్ చేసుకోవచ్చు. తరువాత ఈ ప్లాన్ అప్‌డేట్ చేశాక ప్రతిరోజూ 1.5 జిబి డేటాను అందించింది.  జియో వెబ్‌సైట్‌లో రూ.153 ప్లాన్ స్థానంలో కొత్తగా రూ.155 ప్లాన్‌ను జాబితా చేశారు.

also read వాట్సాప్ మరో సంచలన నిర్ణయం.. ఫిబ్రవరి 8 తరువాత వాట్సాప్ అక్కౌంట్స్ పై క్లారీటి.. ...

రూ.153  ప్లాన్ తో ప్రతిరోజూ 1.5 జీబీ డేటా, 28 రోజులు వాలిడిటీ అందుబాటులో ఉండగా కొత్త రూ.155 ప్లాన్ తో  1 జీబీ డేటా మాత్రమే అందుతోంది. ప్రస్తుతం జియో ఫోన్ కస్టమర్లు ఇప్పుడు నాలుగు ప్లాన్‌లు మాత్రమే ఉన్నాయి, వీటిలో రూ.185, రూ.155, రూ.125, రూ.75 ప్లాన్‌లు ఉన్నాయి. రూ 99, రూ.297, రూ.594 ప్రీ-పెయిడ్ ప్లాన్‌లను కూడా జియో తొలగించింది.

గత సంవత్సరం 2019 డిసెంబర్‌లో అమలు చేసిన ఐయుసి నిమిషాలను జియో తొలగించింది. ఐయుసి నిమిషాలు అమలు చేసిన తరువాత, జియో కస్టమర్లు ఇతర నెట్‌వర్క్‌లకు కాల్ చేయడానికి ప్రత్యేక చార్జిలు చెల్లించాల్సి వచ్చింది.

Follow Us:
Download App:
  • android
  • ios