వాట్సాప్  కొత్త ప్రైవసీ పాలసీ నిబంధనలకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా  చర్చనీయాంశంగా మారింది. గతకొంత కాలంగా  వాట్సాప్ వినియోగదారులలో మొదలైన ఆందోళనలకు చెక్ పెడుతూ  తాజాగా పెద్ద నిర్ణయం తీసుకుంది.

వాట్సాప్ వినియోగదారులను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీ  నిబంధనలను అంగీకరించడాన్ని వచ్చే మూడు నెలల వరకు వాయిదా వేసింది.

ఇటువంటి పరిస్థితిలో వాట్సాప్ కొత్త నిబంధనలను అంగీకరించని వారి ఖాతా ఫిబ్రవరి 8న తరువాత తొలగించబడవు.  అయితే కొత్త ప్రైవసీ పాలసీ  నిబంధనలలో ఫిబ్రవరి 8 తరువాత వాట్సాప్  కొత్త ప్రైవసీ పాలసీ నిబంధనలను అంగీకరించని వారి ఖాతాలను తొలగించబడుతుంది అని వాట్సాప్  పేర్కొనడం గమనార్హం. దీనికి సంబంధించి 

కొత్త కొత్త ప్రైవసీ పాలసీని అంగీకరించకపోతే ఫిబ్రవరి 8న వారి ఖాతాలు తొలగించబడతాయని మేము మా  వినియోగదారులకు తెలియజేశామని వాట్సాప్ ఒక బ్లాగులో పేర్కొంది.  దీనిపై స్పందించిన వాట్సాప్  మేము మా కొత్త నిబంధనలను రాబోయే మూడు నెలల వరకు వాయిదా వేస్తున్నాము.

ఫిబ్రవరి 8 తరువాత వినియోగదారుల ఖాతా తొలగించబడదు అని వాట్సాప్ ఒక ట్వీట్ చేయడం ద్వారా తెలియజేసింది. వాట్సాప్ కొత్త నిబంధనలను చదవడానికి, అర్థం చేసుకోవడానికి వినియోగదారులకు పూర్తి సమయం కావాలని మేము కోరుకుంటున్నాము. కొత్త పరిస్థితుల గురించి వినియోగదారులలో అన్ని రకాల అపోహలను, పుకార్లను తొలగించడానికి మేము ప్రయత్నిస్తున్నాము.

ఇంతకుముందు కూడా వాట్సాప్  ఒక బ్లాగులో మేము వాట్సాప్  వినియోగదారుల ప్రైవేట్ చాట్లను చదవలేదని, వాట్సాప్   కాల్స్ వినలేదని స్పష్టం చేసింది. వాట్సాప్  వినియోగదారుల డేటాను ఫేస్‌బుక్ లేదా మరే ఇతర సంస్థతో పంచుకోలేదని కంపెనీ స్పష్టం చేసింది. వినియోగదారుల డేటా ఎండ్-టు-ఎండ్  ఎన్ క్రిప్ట్ చేయబడిందని వెల్లడించింది.

ట్సాప్  కొత్త ప్రైవసీ పాలసీ విధానం తరువాత టెలిగ్రామ్, సిగ్నల్ యాప్ డౌన్‌లోడ్‌లో విపరీతమైన పెరుగుదల  నమోదు  చేశాయి. టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్ వంటి ప్రముఖులు కూడా ప్రజలను సిగ్నల్ యాప్ వాడాలని సూచించారు. కొత్త వాట్సాప్ విధానం తరువాత టెలిగ్రామ్ కేవలం 72 గంటల్లో 25 మిలియన్ల కొత్త వినియోగదారులను పొందింది, మొత్తం వినియోగదారుల సంఖ్య 500 మిలియన్లను దాటింది.