Asianet News TeluguAsianet News Telugu

జియోఫై స్వాతంత్య్ర దినోత్సవం ఆఫర్‌.. 5 నెలల పాటు ఫ్రీ 4జీ డేటా, కాల్స్..

రిలయన్స్ జియో జియోఫై హాట్‌స్పాట్ ధర రూ. 1,999 జియో స్టోర్‌లో కానీ, ఆన్‌లైన్‌లో కానీ అభిస్తుంది. జియో స్వాతంత్ర్య దినోత్సవం ఆఫర్ పొందటానికి, వినియోగదారులు మొదట జియోఫై  కనెక్షన్ ప్లాన్లలో ఏదైనా ఒకటి రిచార్జ్  చేసుకొవాలి. జియో సిమ్ యాక్టివేట్ అయిన తర్వాత, వినియోగదారులు జియోఫై యాక్టివేట్ కావడానికి అందుబాటులో ఉన్న మూడు జియోఫై ప్లాన్‌లలో దేనినైనా ఎంచుకోవచ్చు.

Jio Offers 5 Months of Free Data, Calls With JioFi For Independence Day
Author
Hyderabad, First Published Aug 15, 2020, 12:44 PM IST

రిలయన్స్ జియో  స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా వినియోగదారులకు అధ్భూతమైన ఆఫర్ అందించింది. ఐదు నెలల పాటు ఉచిత 4జి డేటా, కాంప్లిమెంటరీ జియో-టు-జియో ఫోన్ కాల్స్ ను  జియోఫై 4జి వైర్‌లెస్ హాట్‌స్పాట్‌ కొనుగోలు పై అందిస్తోంది. వైర్‌లెస్ హాట్‌స్పాట్‌ ఉన్నవారికి కూడా వర్తిస్తుంది.

రిలయన్స్ జియో జియోఫై హాట్‌స్పాట్ ధర రూ. 1,999 జియో స్టోర్‌లో కానీ, ఆన్‌లైన్‌లో కానీ అభిస్తుంది. జియో స్వాతంత్ర్య దినోత్సవం ఆఫర్ పొందటానికి, వినియోగదారులు మొదట జియోఫై  కనెక్షన్ ప్లాన్లలో ఏదైనా ఒకటి రిచార్జ్  చేసుకొవాలి. జియో సిమ్ యాక్టివేట్ అయిన తర్వాత, వినియోగదారులు జియోఫై యాక్టివేట్ కావడానికి అందుబాటులో ఉన్న మూడు జియోఫై ప్లాన్‌లలో దేనినైనా ఎంచుకోవచ్చు.

జియోఫై హాట్‌స్పాట్ లో సిమ్‌ను  వేసిన  తర్వాత, ఎంచుకున్న ప్లాన్ కొన్ని గంటలలో ప్రారంభమవుతుంది.ప్లాన్  యాక్టివేషన్ గురించి  మైజియో యాప్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. జియోఫై హాట్‌స్పాట్ ని సంస్థ  సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో కూడా కొనుగోలు చేయవచ్చు.

also read డ్యూయల్ స్క్రీన్ తో మైక్రోసాఫ్ట్ కొత్త స్మార్ట్ ఫోన్.. సెప్టెంబర్ 10 నుండి ప్రీ బుకింగ్‌.. ...

జియో సరసమైన ఆఫర్ రూ. 199తో ప్రతిరోజూ 1.5జి‌బి డేటాను, 28 రోజుల వాలిడిటీ ఇస్తుంది. మీరు అదనంగా జియో ప్రైమ్ సభ్యత్వం పొందటానికి రూ. 99 రిచార్జ్ తో ప్రతిరోజూ 1.5 జిబి, ఆన్ లిమిటెడ్ జియో నుండి జియో కాల్స్, 1000 జియో నుండి ఇతర మొబైల్ నెట్‌వర్క్ నిమిషాలు 28 రోజులు వాలిడిటీ, రోజుకు 100 జాతీయ ఎస్‌ఎంఎస్‌లను 140 రోజులకు పొందవచ్చు.

రెండవ ఆఫర్ రూ. 249తో 28 రోజుల పాటు ప్రతిరోజూ 2జి‌బి డేటాను అందిస్తుంది. ఇక్కడ కూడా మీరు అదనంగా జియో ప్రైమ్ సభ్యత్వానికి రూ. 99తో రోజుకు 2 జిబి, ఆన్ లిమిటెడ్ జియో నుండి జియో కాల్స్, 1000 జియో నుండి ఇతర మొబైల్ నెట్‌వర్క్ నిమిషాలు 28 రోజులు పాటు ఉంటుంది. రోజుకు 100 జాతీయ ఎస్‌ఎంఎస్‌లను 112 రోజుల పాటు  పొందవచ్చు.

మూడవ ఆప్షన్ రూ. 349తో మీకు 28 రోజుల పాటు ప్రతిరోజూ 3జి‌బి డాటా ఇస్తుంది. రూ. 99తో మీకు జియో ప్రైమ్ సభ్యత్వం ద్వారా రోజుకు 3 జిబి డేటా, ఆన్ లిమిటెడ్ జియో నుండి జియో కాల్స్, 1,000 నిమిషాల జియో నుండి ఇతర మొబైల్ నెట్‌వర్క్ కాల్స్, 28 రోజుల వాలిడిటీ, రోజుకు 100 జాతీయ ఎస్‌ఎంఎస్‌లు 84 రోజులు లభిస్తాయి.
 

Follow Us:
Download App:
  • android
  • ios