ముంబై: కరోనా వైరస్ వ్యాపించకుండా కేంద్ర ప్రభుత్వం విధించిన దేశవ్యాప్త లాక్‌డౌన్‌ వల్ల అమలులోకి వచ్చిన ఆంక్షలతో దాదాపు ప్రజలందరూ ఇంటికే పరిమితం అయ్యారు. దీంతో దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ డేటా వినియోగం భారీగా పుంజుకుంది.

ఈ నేపథ్యంలో దేశీయ టెలికాం కంపెనీలు తమ ఇంటర్నెట్, డేటా ప్లాన్లను ఎప్పటికపుడు సమీక్షిస్తున్నాయి. తాజాగా రిలయన్స్ జియో ఫైబర్  (ఫైబర్-టు-హోమ్) వినియోగదారుల కోసం  ఒక అద్భుతమైన కాంబో ప్లాన్‌ను ప్రకటించింది. రూ.199 లకు వేగవంతమైన 1000 జీబీ  డేటాను అందిస్తున్నట్టు ప్రకటించింది. 

ఈ ప్లాన్ వాలిడిటీ స్వల్ప కాలం అంటే  ఏడు రోజుల వరకు చెల్లుబాటు అవుతుంది. అంతేకాదు, ఈ ప్లానులో డేటా 100 ఎంబీపీఎస్ వేగంతో వస్తుంది. ఈ కాంబో ప్లాన్  ప్రస్తుత బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ అయిపోయిన వారికి, లేదా అదనపు డేటా అవసరం ఉన్నవారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. 

also read  ఉద్యోగాల కోతపై క్లారీటి: కొత్తగా 40 వేల జాబ్స్... కానీ ?

అయితే లిమిట్ దాటిన అనంతరం ఇది ఒక ఎంబీపీఎస్‍కు పడిపోతుందని రిలయన్స్ జియో వెల్లడించింది. పాత కస్టమర్లతోపాటు కొత్త వారికి కూడా ఈ ప్లాన్ అందుబాటులో ఉంటుంది. 

ఈ ప్లాన్ కింద వినియోగదారులకు రూ. 199 కాంబో ప్లాన్ జీఎస్టీతో కలిపి మొత్తం రూ .234 ఖర్చు అవుతుంది. దీంతోపాటు ఉచిత వాయిస్ కాలింగ్ ప్రయోజనాలను అందిస్తుంది. అయితే, మైజియో యాప్ కాంప్లిమెంటరీ యాక్సెస్ లేదా ఉచిత ఎస్ఎంఎస్ వంటి అదనపు ప్రయోజనాలు ఈ కాంబో ప్లాన్‌లో లభించవు. 

కాగా కోవిడ్ -19 వల్ల దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ సమయంలో ప్రజలంతా ఇంటర్నెట్ పైనే ఎక్కువ కాలం గడుపుతున్నారు.  పెరిగిన డేటా వినియోగాన్ని అందిపుచ్చుకునే  క్రమంలో టెలికం దిగ్గజాలు తమ డేటాప్లాన్లను సమీక్షిస్తుండటంతో పాటు రీఛార్జ్  సౌకర్యాన్ని సులభతరం చేశాయి. జియో పాటు ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా చందాదారులు ఏటీఎం సెంటర్లలో రీఛార్జ్‌ చేసుకునే వెసులుబాటును ఇటీవల ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.