Asianet News TeluguAsianet News Telugu

అలాంటి ఇ-మెయిల్స్‌ తో జాగ్రత్త: ఐ‌టి శాఖ

"పన్ను చెల్లింపుదారులు జాగ్రత్త వహించాలి! దయచేసి పన్ను రిఫండ్  ఇస్తానని హామీ ఇచ్చే ఎలాంటి నకిలీ లింక్‌పై క్లిక్ చేయవద్దు. ఎందుకంటే ఇలాంటి  ఫిషింగ్ ఇ-మెయిల్స్‌, నకిలీ లింకులను ఆదాయపు పన్ను శాఖ పంపించదు ”అని ఆదాయపు పన్ను శాఖ విభాగం ఒక సోషల్ మీడియా ద్వారా ట్వీట్‌ చేసింది. 

it sector warns to taxpayers on fake links and e-mails
Author
Hyderabad, First Published May 4, 2020, 11:47 AM IST

న్యూ ఢిల్లీ: పన్ను రిఫండ్ ఇస్తామని హామీ ఇచ్చే ఫిషింగ్ ఇ-మెయిల్స్‌పై జాగ్రత్త వహించాలని ఆదాయపు పన్ను శాఖ ఆదివారం పన్ను చెల్లింపుదారులను హెచ్చరించింది.

"పన్ను చెల్లింపుదారులు జాగ్రత్త వహించాలి! దయచేసి పన్ను రిఫండ్  ఇస్తానని హామీ ఇచ్చే ఎలాంటి నకిలీ లింక్‌పై క్లిక్ చేయవద్దు. ఎందుకంటే ఇలాంటి  ఫిషింగ్ ఇ-మెయిల్స్‌, నకిలీ లింకులను ఆదాయపు పన్ను శాఖ పంపించదు ”అని ఆదాయపు పన్ను శాఖ విభాగం ఒక సోషల్ మీడియా ద్వారా ట్వీట్‌ చేసింది.

గత నెల 8 నుంచి 20 వరకు ఐటీ విభాగం వివిధ రకాల పన్ను చెల్లింపుదారులకు రూ.9 వేల కోట్లకుపైగా రిఫండ్‌ చేసినట్టు తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

also read అలెర్ట్ : వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేస్తున్నారా...అయితే మీ కంప్యూటర్లపై సైబర్‌ దాడులు జరగొచ్చు..

కరోనా వైరస్ వ్యాప్తితో బాధపడుతున్న వ్యక్తులకు  లేదా వ్యాపారాలకు ఉపశమనం కలిగించడానికి ఏప్రిల్ 8 న, పెండింగ్‌లో ఉన్న ఆదాయపు పన్ను రిఫండ్ 5 లక్షల రూపాయల వరకు లభిస్తుందని, ఇది సుమారు 14 లక్షల మంది పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనం చేకూరుస్తుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఫిషింగ్ ఇ-మెయిల్స్‌ వంటిని మీకు వస్తే వాటిని ఎవరికి షేర్ చేయవద్దు అలాగే అలాంటి లింక్స్ పై జాగ్రత వహించాలి. 

Follow Us:
Download App:
  • android
  • ios