న్యూఢిల్లీ/ ముంబై: సవాళ్లు, ఇబ్బందులు నెలకొన్నా భారత ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ) రంగం వృద్ధి పథంలో సాగుతోంది. ఈ ఆర్థిక సంవత్సరం (2019-20) ఇప్పటి వరకు ఈ రంగం 2.05 లక్షల మందికి కొత్తగా ఉద్యోగాలు కల్పించింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఐటీ పరిశ్రమల వృద్ధిపై 'నాస్కాం' కీలక ప్రకటన చేసింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఐటీ రంగం 7.7 శాతం మేర వృద్ధి సాధిస్తుందని అంచనా వేసింది. ఈ సమయంలో ఐటీ పరిశ్రమల ఆదాయం 19,100 కోట్ల​ డాలర్లకు (సుమారు రూ.13.82 లక్షల కోట్లు) చేరుతుందని పేర్కొంది. 

also read చుక్కలు చూపిస్తున్నా నిత్యావసర ధరలు... 6ఏళ్ల గరిష్టానికి...

నాస్కాం వార్షిక లీడర్​షిప్​ ఫోరంలో అసోసియేషన్ ఛైర్మన్ కేశవ్​ మురుగేశ్​ ఈ అంచనాలను వెల్లడించారు.  కొత్త ఉద్యోగాలతో కలిపి ఐటీ పరిశ్రమలో మొత్తం ఉద్యోగుల సంఖ్య 43.6 లక్షలకు చేరినట్లు పేర్కొన్నారు.

డాలర్‌తో రూపాయి తరుగుదల వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటే మాత్రం ఆదాయ వృద్ధి రేటు 7.7 శాతం మాత్రమే ఉంటుంది. ప్రస్తుతం ఆర్థిక మందగమనం నేపథ్యంలో 8.1 శాతం వ్రుద్దిరేటు అంచనా వేసినా 7.7 శాతం నమోదు కావడం ఆమోద యోగ్యమేనని నాస్కామ్ పేర్కొంటుంది. 

సంవత్సరం డిజిటల్‌ టెక్నాలజీ సేవల  ఆదాయం 23 శాతం వరకు పెరగనుందని నాస్కామ్‌ పేర్కొంది. వాణిజ్య యుద్ధాలు, అభివృద్ధి చెందిన దేశాలు అనుసరిస్తున్న స్వీయ వాణిజ్య రక్షణ విధానాలు మన ఐటీ ఎగుమతులకు ప్రధాన అడ్డంకులని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. 

బ్రెగ్జిట్‌ ప్రభావంపైనా ఇంకా స్పష్టత రాలేదు. ఐటీ, బీపీఓ రంగంలో ఉన్న ఉద్యోగులకు కొత్త డిజిటల్‌ టెక్నాలజీల నైపుణ్యాలపై శిక్షణ ఇవ్వడమూ పరిశ్రమకు పెద్ద సవాల్‌గా మారింది. ఇందుకోసం పరిశ్రమవర్గాలు తమ ఆదాయంలో 1.5 శాతం వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. 

also read వంట గ్యాస్ ధర మళ్ళీ పెరిగింది...సిలిండర్ పై ఎంతంటే ?

ఇండస్ట్రీలో వస్తున్న డైనమిక్ మార్పుల నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ‘ఫిలాసొఫికల్ షిఫ్ట్ యాజ్ ది ల్యాండ్ స్కేప్ చేంజెస్’కు కేంద్రంగా మారుతుందని, పెద్దగా ఆదాయ వ్రుద్ది నమోదు కావడం లేదని నాస్కామ్ పేర్కొన్నది. 2019లో మాదిరిగానే సంపన్న దేశాల మార్కెట్ పై టెక్ దిగ్గజాలు కేంద్రీకరిస్తాయని, వ్యయం ఆ దిశగానే ఉంటుందని 60 శాతం మంది సీఈఓలు పేర్కొన్నట్లు నాస్కామ్ నిర్వహించిన సీఈఓ సర్వే తెలిపింది. 

ఐటీ, బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ సర్వీసెస్ ఇండస్ట్రీ వ్రుద్ధిరేటు 9.2 శాతంగా నమోదవుతుందని అంచనా వేసింది. ఇంటర్నేషనల్ కంపెనీలు తమ ఇన్నోవేషన్ ప్రాజెక్టులను బలోపేతం చేయడంపైనే కేంద్రీకరించాయని నూతన తరం స్టార్టప్ సంస్థల్లో పెట్టుబడులు పెడుతున్నాయని నాస్కామ్ తెలిపింది. 

దేశీయ స్టార్టప్ సంస్థల్లో పెట్టుబడులు 400 కోట్ల డాలర్లకు చేరాయని అంచనా వేసింది. ఐటీ రంగం, టెక్ నిపుణుల సారథ్యంలోని స్టార్టప్‌ల్లో ప్రత్యేకించి ఈ-కామర్స్ బిజినెస్ 25.6 శాతం వ్రుద్ధిరేటు కలిగి ఉంది.