ఫ్రీగా ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ చూడాలనుకుంటున్నారా, అయితే ఇలా చేయండి..
అమెజాన్ ప్రైమ్, డిస్నీ+ హాట్‌స్టార్ లాంటి ఓటీటీ సబ్‌స్క్రిప్షన్స్ ఉచితంగా అందించేందుకు రిలయెన్స్ జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా పోటాపోటీగా కొత్త ప్లాన్స్ ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే కొన్ని ప్లాన్స్ ద్వారా రీఛార్జ్ చేసేవారికి ఓటీటీ సబ్‌స్క్రిప్షన్స్ ఫ్రీగా లభిస్తున్నాయి.
ఐపీఎల్ సీజన్ వచ్చేసింది. సెప్టెంబర్ 19 సాయంత్రం 7:30 నుంచి ఐపీఎల్ మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. దీంతో క్రికెట్ లవర్స్ సందడి మొదలవుతుంది. అందరి నోటి నుంచి స్కోర్ ఎంత అనే పదం వినిపిస్తుంది. చాలా మంది క్రికెట్ అభిమానులు టివిలలో క్రికెట్ మ్యాచ్ చూడాలనుకుంటారు కానీ ఉద్యోగం, వృతి కారణంగా స్మార్ట్ ఫోన్ లో చూస్తుంటారు.
సాధారణంగా ఒకోసారి నెట్ వర్క్ సమస్యలు లైవ్ మ్యాచ్ చూస్తున్నపుడు చిరాకు తెప్పిస్తుంటాయి, లేదా డాటా సమస్యలు ఏదురవుతుంటాయి. ఇందుకోసం టెలికాం సంస్థలు ఒక మంచి ఆలోచన చేశాయి. మరి మీరు ఐపీఎల్ మ్యాచ్‌లను ఫ్రీగా చూడాలనుకుంటున్నారా? అయితే ఎలాగో తెలుసుకోండి.
అమెజాన్ ప్రైమ్, డిస్నీ+ హాట్‌స్టార్ లాంటి ఓటీటీ సబ్‌స్క్రిప్షన్స్ ఉచితంగా అందించేందుకు రిలయెన్స్ జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా పోటాపోటీగా కొత్త ప్లాన్స్ ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే కొన్ని ప్లాన్స్ ద్వారా రీఛార్జ్ చేసేవారికి ఓటీటీ సబ్‌స్క్రిప్షన్స్ ఫ్రీగా లభిస్తున్నాయి.
రిలయెన్స్ జియో కొత్తగా ప్రకటించిన రూ. 499 ప్లాన్. ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేస్తే రోజూ 1.5జీబీ 4జీ డేటా లభిస్తుంది. ఈ ప్లాన్ వాలిడిటీ 56 రోజులు. రోజూ 1.5 జీబీ డేటా చొప్పున 84జీబీ వాడుకోవచ్చు. అదనంగా ఈ రిచార్జ్ పై ఏడాది పాటు డిస్నీ+ హాట్‌స్టార్ వీఐపీ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది.
ఐపీఎల్ సందర్భంగా జియో ప్రకటించిన ప్లాన్ రూ.777. ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేస్తే రోజూ 1.5జీబీ 4జీ డేటా 84 రోజుల పాటు లభిస్తుంది. అదనంగా మరో 5జీబీ డేటా కూడా పొందొచ్చు. అంటే మొత్తం 131జీబీ డేటా వాడుకోవచ్చు. జియో నుంచి జియోకు అన్‌లిమిటెడ్ కాల్స్, జియో నుంచి ఇతర నెట్వర్క్ 3000 నిమిషాల కాల్స్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్‌కు కూడా ఏడాది పాటు డిస్నీ+ హాట్‌స్టార్ వీఐపీ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది.
రిలయన్స్ జియో గతంలో ప్రకటించిన రూ.401 ప్లాన్ రీఛార్జ్ చేసేవారికి 28 రోజుల వేలిడిటీతో రోజుకు 3జీబీ చొప్పున 84జీబీ డేటాతో పాటు అదనంగా 6జీబీ డేటా లభిస్తుంది. అంటే మొత్తం 90 జీబీ డేటా ఉపయోగించుకోవచ్చు. జియో నుంచి జియోకు అన్‌లిమిటెడ్ కాల్స్, జియో నుంచి ఇతర నెట్వర్క్స్‌కు 1000 నిమిషాలు కాల్స్ మాట్లాడొచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు ఉపయోగించుకోవచ్చు. డిస్నీ+ హాట్‌స్టార్ వీఐపీ సబ్‌స్క్రిప్షన్ కూడా ఉచితం.
also read ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్.. కేవలం రూ.1 చెల్లిస్తే చాలు.. ...
రిలయెన్స్ జియో రూ.2599 ప్లాన్ రీఛార్జ్ చేసేవారికి 365 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజుకు 2జీబీ చొప్పున 730జీబీ డేటాతో పాటు అదనంగా 10జీబీ డేటా లభిస్తుంది. అంటే మొత్తం 740 జీబీ డేటా ఉపయోగించుకోవచ్చు. జియో నుంచి జియోకు అన్‌లిమిటెడ్ కాల్స్, జియో నుంచి ఇతర నెట్వర్క్స్‌కు 12000 నిమిషాలు కాల్స్ మాట్లాడొచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు ఉపయోగించుకోవచ్చు. డిస్నీ+ హాట్‌స్టార్ వీఐపీ సబ్‌స్క్రిప్షన్ ఉచితం.
రిలయెన్స్ జియో రూ.612 యాడ్ ఆన్ ప్లాన్. అంటే ప్రస్తుతం ఏదైనా ప్లాన్‌లో ఉన్నవారు మాత్రమే ఈ ప్లాన్ రీఛార్జ్ చేయాలి. వారికి రూ.51 విలువైన 12 వోచర్లు వస్తాయి. 6జీబీ డేటా లభిస్తుంది. జియో నుంచి జియోకు అన్‌లిమిటెడ్ కాల్స్, జియో నుంచి ఇతర నెట్వర్క్స్‌కు 500 నిమిషాలు కాల్స్ మాట్లాడొచ్చు. జియో యాప్స్ కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. రూ.1004, రూ.1206, రూ.1208 యాడ్ ఆన్ ప్లాన్‌లకు కూడా డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ పొందొచ్చు.
ఎయిర్‌టెల్ రూ.448 ప్రీపెయిడ్ ప్లాన్ రీఛార్జ్ చేసుకున్నవారికి రోజూ 3జీబీ హైస్పీడ్ ఇంటర్నెట్ డేటా ఉచితంగా లభిస్తుంది. 28 రోజుల పాటు అన్ని నెట్వర్క్స్‌కు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు అలాగే డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది.
ఎయిర్‌టెల్ రూ.599 ప్రీపెయిడ్ ప్లాన్ రీఛార్జ్ చేసుకున్నవారికి రోజూ 2జీబీ హైస్పీడ్ ఇంటర్నెట్ డేటా ఉచితంగా లభిస్తుంది. అన్ని నెట్వర్క్స్‌కు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ 56 రోజుల పాటు చేసుకోవచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు, డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది.
ఎయిర్‌టెల్ రూ.2698 సంవత్సర ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే 365 రోజుల వేలిడిటీ, రోజూ 2జీబీ హైస్పీడ్ డేటా, 100 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు. ఏ నెట్వర్క్‌కైనా అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్‌పై డిస్నీ+ హాట్‌స్టార్, ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్స్ ఉచితంగా లభిస్తాయి.